29.7 C
Hyderabad
May 3, 2024 04: 30 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి జిల్లాలో 13 మంది అభ్యర్థుల రిజెక్ట్

#kamareddy

కామారెడ్డి జిల్లాలో మూడు నియోజకవర్గాల పరిధిలో 108 మంది అభ్యర్థులు నామినేషన్స్ దాఖలు చేయగా సోమవారం నాటి స్క్రూట్నిలో 13 మంది అభ్యర్థుల నామినేషన్స్ రిజెక్ట్ చేశారు. కామారెడ్డి నియోజకవర్గంలో ఆరుగురు అభ్యర్థులకు సంబంధించి 8 నామినేషన్స్, ఎల్లారెడ్డి నియోజకవర్గ పరిధిలో ఇద్దరు అభ్యర్థులకు సంబందించి 2 నామినేషన్స్, జుక్కల్ నియోజకవర్గ పరిదిలో ఐదుగురు అభ్యర్థులకు సంబంధించిన 6 నామినేషన్స్ రిజెక్ట్ చేశారు.

కామారెడ్డి నియజకవర్గంలో దుడుగు పాండురంగం, (భారత యువజన పార్టీ), హోసన్న కూడలి (ఇండియన్ బిలీవర్స్ పార్టీ), చిందం  మల్లయ్య (స్వతంత్ర అభ్యర్థి ), కాంబ్లే నాందేవ్ (స్వతంత్ర అభ్యర్థి), సపావత్ సుమన్(స్వతంత్ర అభ్యర్థి), సబిత, ఎస్ (స్వతంత్ర అభ్యర్థి) అభ్యర్థుల నామినేషన్లు రిజెక్ట్ అయ్యాయి. ఎలారెడ్డి నియజకవర్గంలో స్వతంత్ర అభ్యర్థి జాట్రోత్ సురేంద్ర, యుగ తులసి పార్టీకి చెందిన కిచ్చయ్యగారి దీపక్ రెడ్డి నామినేషన్స్ రిజెక్ట్ అయ్యాయి.  జుక్కల్ నియోజక వర్గంలో స్వతంత్ర అభ్యర్ధులు శోభావతి షిండే, కాంబ్లే  నాందేవ్, రాజు, రాజశేఖర్ గైని అభ్యర్థులకు సంబంధించిన నామినేషన్స్ రిజెక్టయ్యాయి.

జిల్లాలో ముఖ్యంగా కామారెడ్డి నియోజకవర్గంలో బీఆర్ఎస్ నుంచి సీఎం కేసీఆర్, కాంగ్రెస్ నుంచి టిపిసిసి చీఫ్ రేవంత్ రెడ్డి, బీజేపీ నుంచి కాటిపల్లి వెంకట రమణారెడ్డి, ఎల్లారెడ్డి నియోజకవర్గంలో జాజాల సురేందర్(బీఆర్ఎస్), మదన్ మోహన్ రావు(కాంగ్రెస్), వడ్డేపల్లి సుభాష్ రెడ్డి(బీజేపీ), జుక్కల్ నియోజకవర్గంలో హన్మంత్ షిండే(బీఆర్ఎస్), లక్ష్మీకాంతారావు(కాంగ్రెస్), అరుణతార(బీజేపీ) ఎమ్మెల్యే అభ్యర్థులుగా ఉన్నారు. కామారెడ్డి నియోజకవర్గంలో అత్యధికంగా స్వతంత్ర అభ్యర్ధులు ఉండగా ఈసారి ఎన్నికల సమరం రసవత్తరంగా మారనుంది. ఈ నెల 15 న నామినేషన్ విత్ డ్రా అనంతరం ఎన్నికల బరిలో ఎంతమంది ఉంటారు, ఎంతమంది తప్పుకుంటారో తెలియనుంది

సత్యం న్యూస్, కామారెడ్డి

Related posts

ప్రధాని మోడీతో భేటీకి కదలిన రాజధాని రైతులు

Satyam NEWS

సీఎం జగన్ కోరిక తీరింది… లక్ష్యం నెరవేరింది

Satyam NEWS

డీఎస్సీ ఏర్పాట్లపై అధికారుల కసరత్తు

Bhavani

Leave a Comment