28.7 C
Hyderabad
May 6, 2024 08: 39 AM
Slider ఖమ్మం

15 నుండి సీఎం కప్

#CM Cup

గ్రామీణ ప్రాంతాల్లోని యువతలో ఉన్న క్రీడా నైపుణ్యాలను గుర్తించి, మట్టిలో మాణిక్యాలను వెలికితీయాలనే లక్ష్యంగా ప్రభుత్వం సీఎం కప్-2023 చేపట్టినట్లు జిల్లా కలెక్టర్ వి.పి. గౌతమ్ అన్నారు. క్రీడలు మానసిక, శారీరక దృఢత్వాన్ని పెంచుతాయని ఆయన తెలిపారు.

క్రీడలతోనే ఆరోగ్య సమాజ నిర్మాణం అవుతుందని, ప్రభుత్వం క్రీడలకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నదని ఆయన అన్నారు. ప్రతీ గ్రామంలో తెలంగాణ క్రీడా ప్రాంగణాలు, నియోజకవర్గ స్థాయిలో మినీ స్టేడియంల నిర్మాణంచేసి క్రీడాకారులకు అందుబాటులో తెచ్చిందన్నారు.

సోమవారం నుండి జిల్లా వ్యాప్తంగా అన్ని మండల స్థాయిల్లో సీఎం కప్-2023 ని చేపడుతున్నట్లు, మండల స్థాయిలో విజేతలను జిల్లా స్థాయి పోటీల్లో భాగస్వామ్యం చేయనున్నట్లు ఆయన అన్నారు. సీఎం కప్ పోటీల విజయవంతానికి పటిష్ట కార్యాచరణ చేసినట్లు ఆయన తెలిపారు.

జిల్లా స్థాయిలో కలెక్టర్ చైర్మన్ గా, పోలీస్ కమీషనర్ వైస్ ఛైర్మన్ గా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ కో-వైస్ చైర్మన్ గా,ఖమ్మం మునిసిపల్ కమీషనర్, జిల్లా ఒలింపిక్ అసోసియేషన్ అధ్యక్షులు, జిల్లా పరిశ్రమల జనరల్ మేనేజర్, జిల్లా విద్యాధికారి లు సభ్యులుగా, జిల్లా యువజన, క్రీడల అభివృద్ధి అధికారి కన్వీనర్ గా కమిటీ ఏర్పాటుచేసి బాధ్యతలు అప్పగించినట్లు ఆయన అన్నారు.

టోర్నమెంట్ నిర్వహణ ప్రదేశాల్లో టెంట్, త్రాగునీరు, ఓఅర్ఎస్ ప్యాకెట్ల అందుబాటుతో మెడికల్ క్యాంపులు తదితర కనీస సౌకర్యాలు ఏర్పాటుచేయనున్నట్లు ఆయన తెలిపారు. మండల స్థాయిలో ప్రతిభ గల క్రీడాకారులను ఎంపిక చేసి, జిల్లా స్థాయికి టీమ్ ఇంచార్జ్ వివరాలతోపంపించాలన్నారు.

క్రీడా పోటీల సమయం, ఇంచార్జ్ ల పేర్లను ప్రదర్శించాలన్నారు. టీమ్ గేమ్స్ కు సెలక్షన్ కమిటీ ద్వారా జిల్లా టీమ్ ఎంపిక చేయాలని కలెక్టర్ తెలిపారు. రాష్ట్ర స్థాయిలో పాల్గొనే జిల్లా క్రీడాకారులకు టీ షర్ట్స్ అందజేసి, టీమ్ ఇంచార్జ్ లను నియమించి, వారి ద్వారా పోటీలకు పంపాలన్నారు.

సీఎం కప్-2023 మునిసిపల్ పరిధి పోటీలను రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రేపు సాయంత్రం 5.00 గంటలకు సర్దార్ పటేల్ స్టేడియంలో ప్రారంభిస్తారన్నారు. మునిసిపల్ పరిధిలో జరిగే పోటీల్లో అథ్లెటిక్స్ 100 & 400 మీటర్లు, వాలీబాల్, కబాడ్డి, ఖోఖో పోటీలు మెన్ అండ్ ఉమెన్ కి, మెన్ ఫుట్ బాల్ పోటీలు నిర్వహిస్తారన్నారు.

Related posts

మైనారిటీ స్మశాన వాటిక ప్రారంభోత్సవానికి ఆహ్వానం

Bhavani

కామారెడ్డి డిఎస్పీ కార్యాలయంలో ఏసీబీ సోదాలు

Satyam NEWS

సురక్షితమైన ఖమ్మం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

Satyam NEWS

Leave a Comment