34.7 C
Hyderabad
May 5, 2024 02: 19 AM
Slider ఖమ్మం

సురక్షితమైన ఖమ్మం కోసం సీసీ కెమెరాల ఏర్పాటు

#khammampolice

సురక్షితమైన సమాజమే  లక్ష్యంగా ఖమ్మం జిల్లాలో పదిహేను వేల సీసీ కెమెరాల ఏర్పాటుకు పోలీస్ శాఖ ప్రతిష్టాత్మకంగా చర్యలు చేపట్టిందని పోలీస్ కమిషనర్ విష్ణు యస్. వారియర్ అన్నారు. కమ్యూనిటీ పోలీసింగ్ లో భాగంగా మంగళవారం  రఘునాథపాలెం పోలీస్ స్టేషన్ పరిధిలోని వీవీ.పాలెం గ్రామ ప్రజలు స్వచ్ఛందంగా ఏర్పాటు చేసుకున్న 20 సీసీ కెమెరాలను పోలీస్ కమిషనర్ ప్రారంభించారు. 

గ్రామ పంచాయతీ కార్యాలయంలో ఈ సందర్భంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ శాంతి భద్రతల పరిరక్షణ కోసం ఖమ్మం పోలీస్ శాఖ ప్రత్యేక దృష్టిని సారించిందని అందులో భాగంగా  పట్టణాలకు దీటుగా గ్రామాలు అభివృద్ధి దిశగా పయనిస్తున్న ప్రస్తుత తరుణంలో… రక్షణ కోసం  ప్రధాన సంపత్తిగా మారిన సీసీ కెమెరాలతో ఒక పక్క నేరాలను అదుపు చేయడం.. మరో పక్క నేరాలు జరగకుండా అడ్డుకోవడంలో తమ వంతు పాత్రను పోషిస్తూ.. ప్రజల భద్రతా ప్రమాణాలు మరింత మెరుగుపరిచేందుకు సీసీ కెమెరాలు దోహదపడుతుంన్నాయని అన్నారు.

భవిష్యత్తులో జిల్లావ్యాప్తంగా 15 వేల సీసీ కెమెరాలతో నిఘా నీడల్లోకి తీసుకొచ్చి  ఇరవై నాలుగు గంటలూ మనం వేసే ప్రతి అడుగూ సీసీటీవి ఫుటేజీల్లో భద్రం అయ్యేలా ప్రణాళిక సిద్ధం  చేసినట్లు తెలిపారు. నేరస్ధులు కూడా కొత్త తరహా  పద్ధతులను ఎంచుకుని నేరాలు చేస్తూ తప్పించుకునే ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో నిర్విరామంగా పనిచేసే సీసీ కెమెరాలతో  మీ ప్రాంతాలలో అపరిచిత వ్యక్తుల కదలికలు, అసాంఘీక కార్యకాలపాలు,ఏ చిన్న నేర సంఘటన జరిగిన

గుర్తించడానికి  దోహదపడుతుందన్నారు. కేవలం  నగరంలోనే కాకుండా మండల కేంద్రాల్లోనూ, గ్రామాలలో  సీసీ కెమెరాలు ఏర్పాటు చేసి మొత్తం మన జిల్లాలోనే  సేఫ్ అండ్ స్మార్ట్ జిల్లాగా రూపొందించాలని పోలీస్ శాఖ భావిస్తోందని అన్నారు.  

ఆనంతరం కార్యాలయ అవరణలో మొక్కలు నాటారు. కార్యక్రమంలో ఖమ్మం రూరల్ ఏసీపీ భస్వారెెడ్డి, సిఐ సత్యనారాయణ రెడ్డి , రఘునాథపాలెం ఎస్సై,  డీసీసీబీ చైర్మన్ నాగభూషణం, సర్పంచ్ రావెళ్ళ మాధవి, ఎంపీటీసీ హనుమంతరావు,మాజీ సర్పంచ్ కృష్ణమోహన్,పీఏసీఎస్ ఉపాధ్యక్షులు రావేళ్ళ శ్రీనివాస్ ,టీఆర్ఎస్ పార్టీ గ్రామశాఖ అధ్యక్షుడు తొలుపునూరి దానయ్య కుతుం బాకా నరేష్,కాపా భూచక్రం తదితరులు పాల్గొన్నారు.

Related posts

నిర్మల్ లో కోర్టు వర్తికల్ అధికారులకు ఒక రోజు శిక్షణ

Satyam NEWS

సుప్రీం చెప్పినా కేసులు ఉపసంహరించుకుంటున్న జగన్ ప్రభుత్వం

Satyam NEWS

కాంగ్రెస్, బిజెపిల చీకటి ఒప్పందం: మంత్రి కొప్పుల

Bhavani

Leave a Comment