40.2 C
Hyderabad
April 28, 2024 17: 50 PM
Slider కరీంనగర్

సూర్యుడు ఉన్నంతకాలం హిందూ ధర్మం ఉంటుంది

#bandi

సూర్యుడు ఉన్నంత వరకు సనాతన హిందూ ధర్మం ఉంటుందని అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ అన్నారు. హనుమత్జయంతి సందర్భంగా కరీంనగర్ లో హిందూ ఏక్తా యాత్ర జరిగింది. ఈ యాత్ర కు స్థానిక ఎంపీ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ తో పాటు అసోం సీఎం హిమంత్ బిశ్వ శర్మ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అసోం సీఎం మాట్లాడుతూ పదేళ్ళ క్రితం అయోధ్య లో రామందిరం అవుతుంది అని అనుకోలేదని..కానీ ఈ ఏడాది ఆలయ నిర్మాణం పూర్తయిందని.. 370ఆర్టికల్ పోతుందని ఎవరూ అనుకోలేదన్నారు. దేశం లో యూనిఫాం సివిల్ కోడ్ రాబోతుందన్నారు. భారతదేశం నిజమైన సెక్యులర్ దేశం కాబోతుందన్నారు. తెలంగాణ లో రామరాజ్యం రాబోతుందన్నారు. అస్సోం లో 98రూపాలకే పెట్రోల్ వస్తుంది.. కాని తెలంగాణ లో 108రూపాయలు ఉందన్నారు.

అస్సోం లో ప్రభుత్వ ఉద్యోగులకు జీతం 1వ తేదీన వస్తుందన్నారు.50వేల ఉద్యోగాలు కూడా తెలంగాణ లో ఇవ్వలేదన్నారు. తెలంగాణ ప్రభుత్వం పేరు డిల్లీ లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోందన్నారు. డిల్లీ లో ప్రభుత్వ పెద్దలు మధ్యం వ్యాపారం చేస్తున్నారని ధ్వజమెత్తారు.బీఆర్ఎస్ ఎంఐఎం లు ఒకటే అని అన్నారు. బీఆర్ఎస్ వీఆర్ఎస్ తీసుకోవాల్సిన సమయం వచ్చిందన్నారు.భారతదేశం విశ్వగురు స్థానంలో నిలుస్తుందన్నారు. ఈ రోజు పాకిస్థాన్ పరిస్థితి చూడండన్నారు. హిందూ దేవుళ్ళ ను నమ్మని వారి పరిస్థితిని చూడండి వారు ఎలా ఉందో దుస్థితి ఉందన్నారు.ప్రపంచ ఆర్థిక వ్యవస్థ లో నెంబర్ వన్ కాబోతుందన్నారు. మీరు ఒక్క సారి కేరళా స్టోరీ చూడాలన్నారు.హిందూ యువతులను ఉగ్రవాదులు గా ఎలా తయారు చేస్తారో చూపించారన్నారు. లవ్ జిహాద్ అరికట్టేందుకు నేను ప్రయత్నం చేస్తున్నానని అన్నారు. ఆరువేల మదర్సాలనూ బంద్ చేయించామన్నారు.

ఓవైసీ నన్ను చూసుకుంటా అని బెదిరించారన్నారు. వచ్చే ఏడాది మరో వెయ్యి మదర్సాలనూ మూసివేస్తానన్నారు. ఎక్కడికి రమ్మంటే అక్కడికి వెళ్తాను.. ఓవైసీ ఇంట్లో కి కూడా వస్తా ఏం చూస్తాడో చూడాలన్నారు. రజాకర్ రాజ్యం పోవాల్సిన అవసరం ఉందన్నారు  బండి సంజయ్ ఆధ్వర్యంలో పార్టీ ఎన్నికల్లో విజయం సాధించాలని కోరుకుంటున్నానన్నారు. తెలంగాణ మార్పు వస్తుంది… రామరాజ్యం వస్తుంది అని అస్సాం లో చెప్తానన్నారు.

కరీంనగర్ లో జోరుగా కొనసాగుతున్న ‘‘హిందూ ఏక్తా యాత్ర’

బండి సంజయ్ తో కలిసి భారీగా తరలివచ్చిన జన సందోహానికి అభివాదం చేస్తూ హిందూ ఏక్తా యాత్ర ర్యాలీలో పాల్గొన్నారు.. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ. ఇవాళ అర్ధరాత్రి వరకు కొనసాగనున్న.. ‘‘హిందూ ఏక్తా యాత్ర’’.మహిళల డప్పు వాయిద్యాలు, భారీ హనుమంతుడి విగ్రహాలు, విభిన్న వేషధారణలు, విభిన్న సంస్క్రుతి, సాంప్రదాయ వస్త్రధారణలతో సాగుతున్న హిందూ ఏక్తా యాత్రలో పాల్గొన్న కాషాయ సైనికులు, మహిళలు.కరీంనగర్ వైశ్యభవన్, టవర్ సర్కిల్ పరిసరాలు…ఇసుకేస్తే కిందకు రాలనంతగా పరిసర ప్రాంతాలయ్యాయి.

Related posts

అనుమతులు లేకుండా శానిటైజర్లు చేస్తే చర్య తీసుకోవాలి

Satyam NEWS

క్షమాపణలు చెప్పకుంటే ఎమ్మెల్యే మేడా పై 100 కోట్ల పరువు నష్టం దావా

Satyam NEWS

క్వారంటైన్ నిబంధనలకు విరుద్ధంగా గొడవ చేసిన ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment