39.2 C
Hyderabad
May 4, 2024 20: 09 PM
Slider ఆంధ్రప్రదేశ్

ఇద్ద‌రు రైతులు క్షేమం.. మ‌రొక‌రు గ‌ల్లంతు

Vagu Rescue

రాళ్ల‌వాగులో చిక్కుకున్న ఇద్ద‌రు రైతుల‌ను రెస్క్యూ సిబ్బంది కాపాడారు. స‌మ‌యానికి సీఎం ఆదేశాలు, ఎమ్మెల్యే చాక‌చ‌క్యం, అధికారుల తెగువ క‌లిసి ఆ రైతుల‌ని సుర‌క్షితంగా కాపాడ‌గ‌లిగార‌ని స్థానికులు హ‌ర్షం వ్య‌క్తం చేశారు. కాగా ఈ విష‌యంలో కాస్త ఆల‌స్యం జ‌ర‌గ‌డం వ‌ల్ల మ‌రో రైతు గ‌ల్లంత‌య్యాడు. ఆ రైతు కోసం గాలింపు చ‌ర్య‌లు ముమ్మ‌రం చేశారు.

గురువారం ఉదయం పొలం పనులకు వెళ్లిన ముగ్గురు రైతులు వరద ఉధృతిలో చిక్కుకున్నారు. ఈ సంఘటనపై సీఎం ఆదేశాల మేరకు ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రాగుళ్ళ వాగు వద్దకు చేరుకుని సహాయ చర్యలను పర్యవేక్షించారు. మొదట రైతులను కాపాడేందుకు హెలికాప్టర్లను తెప్పించారు. కాగా, వాతావరణం అనుకూలించకపోవడంతో హెలికాప్టర్ల సహాయక చర్యలు ముందుకు సాగలేదు. వెను వెంటనే స్పీడ్ మోటార్ బోట్ లను తెప్పించి రైతులను కాపాడారు. ఇద్దరు రైతులను కాపాడగలిగారు. మరో రైతు వరద ఉధృతి లో గల్లంతయ్యాడు. గల్లైంతైన రైతును కాపాడే చర్యలు చేపట్టారు.

Related posts

మానేపూర్ లో కంటి వెలుగు కేంద్రం ప్రారంభం

Satyam NEWS

వినియోగదారుల హక్కుల పరిరక్షణలో ఆశ్రా సేవలు అభినందనీయం

Bhavani

పౌరసత్వ బిల్లకు విజయవాడలో మైనారిటీల నిరసన

Satyam NEWS

Leave a Comment