31.7 C
Hyderabad
May 7, 2024 00: 49 AM
Slider వరంగల్

ములుగులో ఘనంగా రాజ్యాంగ దినోత్సవం

#MuluguDistrict

ములుగు జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయంలో నేడు భారత రాజ్యాంగ దినోత్సవం ఘనంగా నిర్వహించారు. ముందుగా సెక్టోరల్ అధికారి బద్దం సుదర్శన్ రెడ్డి  అంబేద్కర్ చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా  భారత రాజ్యాంగం లోని ప్రవేశిక ను చదవి వినిపించారు.

అనంతరం భారత రాజ్యాంగం విలువలు, ప్రాథమిక సూత్రాల, ప్రాధమిక హక్కులు, ఆదేశ సూత్రాలు, వాటి గొప్పదనాన్ని తెలిపారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చింది 1947 ఆగస్ట్ 15న. దేశానికి రాజ్యాంగాన్ని రూపొందించేందుకు పలువురు విద్యావేత్తలు, న్యాయనిపుణులు, వివిధ రంగాల ప్రముఖులతో రాజ్యాంగ నిర్మాణ సభను ఏర్పాటు చేశారు.

 ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశానికి రాజ్యాంగాన్ని రూపొందించడమంటే అంత సులువు కాదు. అందుకే రెండేళ్లకు పైనే సమయం పట్టింది. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ నేతృత్వంలోని డ్రాఫ్ట్ కమిటీ ఆధ్వర్యంలో రాజ్యాంగం రూపొందింది.

భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది 1950 జనవరి 26న అని అందరికీ తెలుసు. అందుకే ఆ రోజున గణతంత్ర దినోత్సవం జరుపుకొంటారు. అయితే ఆ రాజ్యాంగానికి ఆమోదముద్ర పడింది మాత్రం గణతంత్ర దినోత్సవానికి సరిగ్గా రెండు నెలల ముందు. అంటే 1949 నవంబర్ 26న.

అందుకే ప్రతీ ఏటా నవంబర్ 26న రాజ్యాంగ దినోత్సవం జరుపుకోవాలని భారత ప్రభుత్వం 2015 నవంబర్ 19న గెజిట్ నోటిఫికేషన్ విడుదల చేసింది అని చెప్పారు. ఈ కార్యక్రమం లో  సూపరెంటెండెంట్ వాజీదు హుస్సేన్, ఉపాధ్యాయులు శ్రీనివాస్, సాంబయ్య, కోడి వెంకట్, నరసింహ, బాలాజీ రవి, సమ్మయ్య,శ్రీ రంగం  కార్యాలయ సిబ్బంది కిరణ్, నూర్ ఉద్ తదితరులు పాల్గొన్నారు.

Related posts

విజ‌య‌న‌గ‌రం భారీ చోరీ కేసులో నిందితుడు అంత రాష్ట్ర వాసి..!

Satyam NEWS

ప్రొటెస్ట్: నరసరావుపేటలో సంపూర్ణంగా బంద్

Satyam NEWS

డబుల్ బెనిఫిట్: ఎక్కడా లేని విధంగా ఇళ్లు కట్టాం

Satyam NEWS

Leave a Comment