పార్లమెంటు లో ప్రవేశపెట్టిన పౌరసత్వ సవరణ బిల్లు కి వ్యతిరేకంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో విజయవాడ ధర్నా చౌక్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. పౌరసత్వ సవరణ బిల్లు ప్రతులను చింపి, మంటలలో కాల్చి కేంద్ర నిర్ణయాన్ని వ్యతిరేకించారు.
దేశ పునాదులను విచ్ఛిన్నం చేసే పౌరసత్వ సవరణ బిల్లుకి వైసిపి టిడిపి రాజ్యసభలో మద్దతు ఉపసంహరించుకోవాలని ప్రజా సంఘాలు కోరాయి. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ప్రతినిధులు ప్రజలు పాల్గొని తమ నిరసనను తెలిపారు. ఈ ఉదయం కేంద్ర ప్రభుత్వం రాజ్యసభలో ప్రవేశ పెట్టిన సందర్భంగా అన్ని ప్రజా సంఘాలు కలిసికట్టుగా, రాజ్యాంగ స్ఫూర్తి కి వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం తెస్తున్న చట్టాన్ని వ్యతిరేకించారు.
ఈ సందర్భంగా మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి రాష్ట్ర అధ్యక్షులు ఫారూఖ్ షి బ్లీ మాట్లాడుతూ వైసిపి ప్రభుత్వం మైనార్టీలకు అండగా ఉంటానని చెప్పింది. రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి తనకు మతం లేదు నేను మానవతా వాది అని చెప్పి ఇప్పుడు లౌకికవాదానికి, ఆర్టికల్ 14 ఆర్టికల్ 21 లను రాజ్యాంగ స్ఫూర్తికి వ్యతిరేకంగా తీసుకువచ్చిన మతోన్మాద బిల్లుకు మద్దతు పలికారని ఆయన అన్నారు.
గాంధీ పుట్టిన దేశంలో మతోన్మాదులు అయిన గాడ్సే వారసులు దేశాన్ని విచ్ఛిన్నం చేసే దిశగా వస్తున్నటువంటి బిల్లులను ప్రతి ఒక్కరు ముక్తకంఠంతో ఖండించవలసిందేనని ఆయన తెలిపారు. మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ధర్నా కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజా సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.
వారిలో సిపిఎం రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కృష్ణయ్య , జమాతే ఇస్లామీ హింద్ మీడియా సెక్రెటరీ సుభాని, ఎండి ఫత్ ఉల్లా, పొలిటికల్ అనలిస్ట్ సయ్యద్ రఫీ, సీనియర్ జర్నలిస్టు ఎస్ వెంకటేశ్వరరావు, కొత్తపల్లి రవి, ఇమ్రాన్ MIM నాయకులు, న్యాయవాది మతీన్, MHPS నాయకులు జోహార్ అబ్దుల్ రజాక్ బాబు మస్తాన్ పఠాన్ ముస్తఫా ఖాన్ మౌలానా హుస్సేన్ తదితర నాయకులు ఉన్నారు.