39.2 C
Hyderabad
May 4, 2024 20: 19 PM
Slider పశ్చిమగోదావరి

రూ. 2 వేల కోట్లతో దెందులూరు అభివృద్ధి

#MLA Kotaru Abbayya Chaudhary

ఏలూరు జిల్లా దెందులూరు నియోజక వర్గాన్ని  2వేల 200 కోట్లతో అభివృద్ధి చేశామని ఎం ఎల్ ఏ కొటారు అబ్బయ్యచౌదరి తెలిపారు. దెందులూరు ఏ ఎం సి చైర్మన్ గా  అప్పన కనక దుర్గా ప్రసాద్ ఆదివారం రాజకీయ అతిరథ మహారదుల సమక్షం లో ప్రమాణస్వీకారం చేశారు. దెందులూరు శాసన సభ్యులు కొటారు అబ్బయ్యచౌదరి ఆర్మి సమక్షంలో జరిగిన అప్పన ప్రసాద్ ప్రమాణస్వీకారానికి వచ్చిన జన సందోహం చూసి  చైర్మన్ తో బాటు వై సి పి ఎం ఎల్ ఏ లు ఉబ్బితబ్బిబ్బయ్యారు.

దెందులూరు నియోజక వర్గ స్థాయి  ఏ బి సి ఆర్మీ ఈ కార్యక్రమానికి పోటెత్తడం తో దెందులూరు మార్కెట్ కమిటీ ప్రాంగణం మంతా తడిసి ముద్దైంది. భూదేవంత అడుగులు ఆకాశమంత పందిళ్లు వేసిన అప్పన్న ప్రమాణస్వీకారోత్సవానికి   రాష్ట్ర శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు మాజీ వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఏలూరు ఎం ఎల్ ఏ ఆళ్ల నాని, నరసాపురం శాసన సభ్యులు ముదునూరు ప్రసాద్ రాజు, పోలవరం శాసన సభ్యులు తెల్లం బాల రాజు, ఎం ఎల్ సి జయ మంగళ వెంకటరమణ, వంకా రవీంద్రనాధ్, ఉంగుటూరు ఎం ఎల్ ఏ పుప్పాల వాసు బాబు, చింతలపూడి ఎం ఎల్ ఏ యు.ఎలిజా,   ఏ పి ఆయిల్ పె డ్ రైతు కమిటి మాజీ చైర్ మెన్ కొటారు రామచంద్రరావు, గోపాలపురం ఎం ఎల్ ఏ తలారి వెంకట్రావు, దెందులూరు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, పిల్లంగోళ్ల శ్రీలక్ష్మి, బి సి నాయకులు ఘంటా ప్రసాదరావు, పెదవేగి మండల సచివాలయాల కన్వీనర్ కేసిన సతీష్ తదితరులు పాల్గొన్నారు.

అప్పన ప్రసాద్ సారథ్యం లో దెందులూరు మార్కెట్ కమిటీని అభివృద్ధి పథం లో పయనిస్తుందన్నారు. ఏ ఎం సి చైర్మన్ గా ప్రమాణం చేసిన అప్పన మార్కెట్ కమిటీ ద్వారా రైతుల పంటలకు గిట్టు బాటు ధర కల్పించడంతో బాటు పంటల ఎగుమతుల దిగుమతుల ద్వారా మార్కెట్ కమిటీ అభివృద్ధికి కృషి చేస్తారని ఎం ఎల్ ఏ అబ్బయ్యచౌదరి అన్నారు. మార్కెట్ కమిటీ ద్వారా రైతులకు సబ్సిడీ పై విత్తనాలు, ఎరువులు, వ్యవసాయ యంత్ర పరికరాలు అందించే దిశగా నూతన మార్కెట్ కమిటీ చైర్మన్ గా ప్రమాణ స్వీకారం చేసిన అప్పన ప్రసాద్ పాలక వర్గం కృషి చేస్తుందని అబ్బయ్య చౌదరి అన్నారు. దెందులూరు గడ్డ 2024 ఎన్నికల్లో కూడా  కొటారు అడ్డాగా మారి ప్యాన్ గాలి లో మరోసారి సైకిల్ షెడ్ కి వెళుతుందని అబ్బయ్య చౌదరి జోస్యం చెప్పారు. దెందులూరు మార్కెట్ కమిటీ నూతన చైర్మన్.డైరెక్టర్ ల ప్రమాణ స్వీకారోత్సవానికి నియోజక వర్గ నలు మూలలనుండి వేలాదిగా తరలి వచ్చిన జగనన్న సైన్యానికి.ఏ బి సి ఆర్మీకి  శిరస్సు వంచి అబ్బయ్యచౌదరి నమస్కరించారు.

Related posts

పల్లె ప్రగతి: సమిష్టి కృషితోనే గ్రామాల సమగ్ర అభివృద్ది

Satyam NEWS

గుడ్ న్యూస్:కరోనా వైరస్ కు చైనా విరుగుడు మందు

Satyam NEWS

రాజగురువుకు తాడేపల్లి నుంచి వార్నింగ్?

Satyam NEWS

Leave a Comment