37.2 C
Hyderabad
May 6, 2024 22: 23 PM
Slider ముఖ్యంశాలు

హైదరాబాద్ లో మరో అంతర్జాతీయ సంస్థ పెట్టుబడి

#KTR

హైదరాబాద్ లో డెలవరీ సెంటర్ ఏర్పాటుచేయనున్న టెక్నాలజీ దిగ్గజం ‘VXI గ్లోబల్ సొల్యూషన్స్’

మరో అంతర్జాతీయ సంస్థ తెలంగాణకు ఎంట్రీ ఇచ్చింది. టెక్నాలజీ రంగంలోని  వినియోగదారులకు వినూత్న సేవలందించడంలో దిగ్గజ సంస్థ గా చెప్పుకునే బైన్ క్యాపిటల్ కు చెందిన ‘VXI గ్లోబల్ సొల్యూషన్స్’ హైదరాబాద్ లో అడుగుపెట్టింది. అమెరికా పర్యటనలో ఉన్న ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి కే.తారకరామారావుతో

VXI గ్లోబల్ సొల్యూషన్స్ గ్లోబల్ చీఫ్ హ్యూమన్ రిసోర్సెస్ ఆఫీసర్ (CHRO) ఎరికా బోగర్ కింగ్ హ్యూస్టన్ లో సమావేశమయ్యారు. తమ సంస్థకు చెందిన డెలవరీ సెంటర్ ను హైదరాబాద్ లో ఏర్పాటుచేస్తామని ప్రకటించారు.

తొమ్మిదేళ్ల స్వల్పకాలంలోనే పెట్టుబడులకు గమ్యస్థానంగా తెలంగాణ ఎలా మారిందో ఎరికా బోగర్ కింగ్ కు మంత్రి కేటీఆర్ వివరించారు. ప్రగతిశీల విధానాలు, అద్భుతమైన మౌలిక సదుపాయాలు, నైపుణ్యం కల శ్రామిక శక్తి తెలంగాణలో ఉన్నందునే ఎన్నో జాతీయ, అంతర్జాతీయ సంస్థలు రాష్ట్రంలో పెట్టుబడులు పెడుతున్నాయన్నారు కేటీఆర్. ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర రావు దార్శనికతతో ఇవాళ తెలంగాణ అన్ని రంగాల్లో అద్భుతమైన పురోగతి సాధించిందన్నారు.

గత ఏడాది దేశవ్యాప్తంగా ఐటీ పరిశ్రమలో 4.50 లక్షల ఉద్యోగాలు ఏర్పడితే అందులో 1.5 లక్షల ఉద్యోగాలు హైదరాబాద్‌లోనే ఉన్న విషయాన్ని కేటీఆర్ ఎరికాతో ప్రస్తావించారు. డెలవరీ సెంటర్ ఏర్పాటుచేయాలన్న VXI గ్లోబల్ సొల్యూషన్స్ నిర్ణయంతో టెక్ కంపెనీల గమ్యస్థానం హైదరాబాదే అన్న సంగతి మరోసారి స్పష్టమైందన్నారు కేటీఆర్.

హైదరాబాద్ లో డైనమిక్ బిజినెస్ ఎకోసిస్టమ్ కారణంగానే తాము డెలవరీ సెంటర్ ను ఏర్పాటుచేస్తున్నామని VXI గ్లోబల్ సొల్యూషన్స్ తెలిపింది. మొదటి మూడు సంవత్సరాల్లోనే ఐదువేల మందికి ఉద్యోగాలు కల్పిస్తామంది. హైదరాబాద్ అభివృద్ధిలో ఈ గ్లోబల్ సెంటర్ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు.

Related posts

ఆరేళ్ల చిన్నారిపై 50 ఏళ్ల వ్యక్తి లైంగిక దాడి

Bhavani

నిరాశ్రయులకు నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

రాణీ రుద్రమదేవి జీవిత కథ తో స్టార్‌ మా లో కొత్త సీరియల్‌

Satyam NEWS

Leave a Comment