దేశంలో రెండో ప్రైవేటు రైలు పట్టాలు ఎక్కింది. భారత రైల్వే చరిత్రలోనే తొలి ప్రైవేటు రైలుగా పేరుగాంచిన తేజస్ ఎక్స్‌ప్రెస్ లక్నో ఢిల్లీ మధ్య విజయవంతంగా నడుస్తున్ననేపథ్యంలో రెండో మార్గంలో ప్రయివేటు రైలును ప్రవేశపెట్టారు. ఈ నెల 19 నుంచి ప్రారంభం కానున్న ఈ రెండో ప్రయివేటు రైలు అహ్మదాబాద్-ముంబయి మార్గంలో నడుస్తుంది. ఈ రెండో తేజస్ రైలును గుజరాత్ ముఖ్యమంత్రి విజయ్ రూపానీ నేడు జెండా ఊపి ప్రారంభించారు. గుజరాత్ నుంచి ఆరున్నర గంటల్లో ఈ రైలు ముంబయి చేరుకోనుంది.
previous post