Slider కరీంనగర్

డోంట్ కం :ఎంఐఎంపార్టీ కరీంనగర్ అధ్యక్షుడు రాజీనామా

resign vahed

ఎంఐఎంపార్టీ కరీంనగర్ జిల్లా అధ్యక్షుడు వాహజ్ అహ్మద్ ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.జిల్లాలో ఎంపీ అసదుద్దీన్ పర్యటస్తున్న రోజే ఆ పార్టీకి ఆ జిల్లా అధ్యక్షుడు రాజీనామా చేయడం సంచలనం సృష్టించింది. మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఎం.ఐ.ఎం. అధినేత, ఎంపీ అసదుద్దీన్ శుక్రవారం కరీంనగర్ జిల్లాలో ప్రచారానికి వస్తుండగా

ఈ రోజు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు వాహజ్ అహ్మద్ జిల్లా అధ్యక్ష పదవికి, పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు తెలుపుతూ పార్టీలో క్రమశిక్షణ, గౌరవం లోపించాయని ఆయన ఆరోపించారు. మున్సిపల్ కార్పోరేషన్ టికెట్ల పంపిణీలో అవకతవకలు జరిగినట్లు ఆయన ఆరోపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల ఫలితాలే టికెట్ల పంపిణీ ఎలా జరిగిందో చెబుతాయని వాహజ్ అహ్మద్ అన్నారు.

Related posts

తండ్రి కాబోతున్న మెగాపవర్ స్టార్ రామ్ చరణ్

mamatha

మళ్లీ క్షిపణి ప్రయోగం: పెట్రేగిపోయిన ఉత్తర కొరియా

Satyam NEWS

చీరాలలో వివాహితను నరికి చంపిన కిరాతకులు

Satyam NEWS

Leave a Comment