41.2 C
Hyderabad
May 4, 2024 16: 05 PM
Slider ప్రత్యేకం

30 మంది ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చేది లేదు

#jagan

వచ్చే ఎన్నికలలో 30 మంది ప్రస్తుత ఎమ్మెల్యేలకు టిక్కెట్లు ఇచ్చే అవకాశం లేదు. ఇదే విషయాన్ని నేడు ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో పనితీరు మెరుగుపరచుకోని వారిపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించిన సీఎం ఎమ్మెల్యేల పని తీరుపై చేసిన సర్వే నివేదికను ప్రదర్శించారు.

30 మంది ఎమ్మెల్యేలు వెనుకబడ్డారని, పని తీరు మార్చుకోకుంటే వచ్చే ఎన్నికల్లో సీట్లు ఇచ్చేది లేదని సీఎం జగన్‌ మోహన్​ రెడ్డి స్పష్టం చేశారు. పని తీరు మెరుగుపరచుకోని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తక్కువ రోజుల పాటు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో తిరిగిన పలువురు ఎమ్మెల్యేల వివరాలు వెల్లడించారు. మార్చి 18 నుంచి ‘మా భవిష్యత్తు నువ్వే జగన్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం నిర్వహించాలని సమావేశంలో నిర్ణయించారు.

ఈలోగా కన్వీనర్లు, సచివాలయ సమన్వయకర్తలకు శిక్షణ ఇవ్వాలని సీఎం ఆదేశించారు. పలు నియోజకవర్గాల్లో పెండింగ్‌లో ఉన్న గృహ సారథులు, కన్వీనర్ల నియామకం వెంటనే పూర్తి చేయాలని వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇవ్వాలని సీఎం నిర్దేశించారు. స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్​ విడుదల చేసిన నేపథ్యంలో ఎన్నికల కోడ్​​పైన సీఎం దృష్టి సారించారు. ఎన్నికల కోడ్ అమల్లో ఉన్న జిల్లాల్లో కార్యక్రమం నిర్వహణపై ఎమ్మెల్యేలతో చర్చించారు. ఎన్నికల కోడ్​ అమల్లో ఉన్న జిల్లాలు మినహా మిగతా అన్ని జిల్లాల్లో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమం విస్తృతంగా చేపట్టాలని సీఎం జగన్​ దిశా నిర్దేశం చేశారు.

Related posts

అత్యాచారాలను అరికట్టేందుకు కఠిన శిక్షలు అమలు చేయాలి

Satyam NEWS

అణచివేత: కామారెడ్డిలో రైతుల అరెస్ట్

Satyam NEWS

గాన అమర్ రహే

Satyam NEWS

Leave a Comment