36.2 C
Hyderabad
April 27, 2024 23: 00 PM
Slider వరంగల్

అంధురాలిని ఆదరించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

#taslima

అచేతనంగా ఉన్న ఓ మహిళ అంధురాలిని ఆదరించిన సబ్ రిజిస్ట్రార్ తస్లీమా మహ్మద్ మానవత్వాన్ని చాటుకున్నారు. సోమవారం ములుగు బస్టాండ్ లో చూపు లేని మహిళకు అన్నం పెట్టి ఆదరించారు. వివరాలలో వెళితే సబ్ రిజిస్ట్రార్ తస్లీమా సోమవారం తన విధులు ముగించుకొని సాయంత్రం ములుగు బస్టాండ్ వద్దకు రాగా ఆర్టీసి సిబ్బంది ఆ మహిళ గురించి తస్లీమాకు తెలిపారు.

తస్లీమా ఆ మహిళను వివరాలు అడుగగా ఆమె పేరు రమ అని ఏటూరు నాగారం అని,తనకు ఎవరు లేరని, కొన్ని సంవత్సరాల క్రితం చూపు కోల్పోయానని తెలిపారు. నన్ను ఎవరో తీసుకువచ్చి ఇక్కడ వదిలేశారని, ఉదయం నుండి ఏం తినలేదని ఆకలిగా ఉందని తెలిపింది. దీంతో చలించిన తస్లీమా అన్నం పెట్టీ ఆకలిని తీర్చారు,బట్టలు, దుప్పట్లు,పండ్లు అందించారు. ఆ మహిళ పేరు రమ (అంధురాలు),తనది ఏటూరు నాగారం ఎవరైనా తెలిసిన వారు ఉంటే తన 9494969039కి సంప్రదించగలని తస్లీమా తెలిపారు.

Related posts

కరోనా బ్రీడింగ్ సెంటర్ గా మారిన ఏపి సెక్రటేరియేట్

Satyam NEWS

రఘురామ ను కష్టడీలో చిత్రహింసలు పెట్టినట్లు ఖరారు

Satyam NEWS

మీరు…పోర్ట్ ఎస్టేట్…. మీ స‌హాకారం ఎంతో అవ‌స‌రం..!

Satyam NEWS

Leave a Comment