37.7 C
Hyderabad
May 4, 2024 12: 57 PM
Slider ప్రత్యేకం

33 ఏళ్లుగా కేసు: ఒకే ఒక్క రోజు జైలు శిక్ష

#court

ఉత్తరప్రదేశ్‌లో ఓ విచిత్రమైన ఘటన వెలుగులోకి వచ్చింది. మారణాయుధం దగ్గర ఉంచుకుని చోరీకి పాల్పడ్డారనే నేరంతో ముగ్గురిని పోలీసులు అరెస్టు చేశారు. 33 ఏళ్లుగా ఇక్కడి మహరాజ్ గంగ్ కోర్టులో కేసు నడిచింది. చివరికి కోర్టు నిందితుడికి కేవలం ఒక రోజు మాత్రమే శిక్ష విధించింది. ఒక రోజు శిక్షతో బాటు నిందితులకు ఒక్కొక్కరికి రూ.500 చొప్పున జరిమానా విధించింది.

‘ఆపరేషన్‌ శికంజా’ (నేరాలను అదుపు చేసేందుకు అలవాటు ప్రకారం నేరాలు చేసేవారిని అరెస్టు చేసే ప్రక్రియ) కింద ముగ్గురు నిందితులను పురందర్‌పూర్‌ పోలీసులు 1989లో అరెస్టు చేశారు. హమీముద్దీన్, శీష్ మహమ్మద్, బుద్ధిరామ్‌ అనే ఈ నిందితులపై ఐపీసీ 382, ​​411 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అనంతరం నిందితులను పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. కోర్టు విచారణ ప్రారంభించి విచారణ కొనసాగింది.

నిందితులను శిక్షించాలని ప్రాసిక్యూషన్ కోర్టును కోరింది. కోర్టు మొత్తం సాక్ష్యాలను చూసి, సాక్ష్యాధారాల ఆధారంగా నిందితులకు ఒకరోజు జైలు శిక్ష విధించింది. నిందితులు జరిమానా చెల్లించకుంటే వారిని మరో 10 రోజులు అదనంగా జైల్లో ఉంచాలని కోర్టు తీర్పు చెప్పింది.

Related posts

అందితే జుట్టు అందకపోతే కాళ్లు పట్టుకుంటే ఎలా ప్రసన్నా?

Satyam NEWS

థర్డ్ వేవ్ నేపథ్యంలో విజయనగరం పోలీసుల సన్నద్ధత

Satyam NEWS

సంక్రాంతి రద్దీకి ఆర్టీసీ సమాయత్తం కావాలి

Bhavani

Leave a Comment