40.2 C
Hyderabad
May 2, 2024 18: 52 PM
Slider విజయనగరం

థర్డ్ వేవ్ నేపథ్యంలో విజయనగరం పోలీసుల సన్నద్ధత

#rajakumariIPS

కరోనా థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉందన్న వార్తలు వస్తున్న వేళ ,ఢిల్లీ ఎయిమ్స్ డైరెక్టర్ స్పష్టం చేసిన సందర్భంలో తెలుగు రాష్ట్రాలు అప్రమత్తం అయ్యాయి.

మరీ ముఖ్యంగా విజయనగరం జిల్లా పోలీసులు మరింత అలెర్ట్ అయ్యారు. ప్రస్తుతం ఉన్న అమలులో ఉన్న కర్ఫ్యూ సడలింపు సమయాన్ని ఉదయం అంతా పొడిగించి సాయంత్రం 6 గంటలు అయ్యేసరికి కర్ఫ్యూ అమలవుతున్న దరిమిలా జిల్లా ఎస్పీ రాజకుమారీ రోడ్లమీదకు వచ్చి సిబ్బంది అలెర్ట్ చేసారు.

ఈ మేరకు జిల్లా కేంద్రంలో సాయంత్రం ఆరుగంటల సమయంలో నగరంలో ఆకస్మికంగా పర్యటించి… అటు ట్రాఫిక్ సిబ్బంది ని ఇటు లా అండ్ ఆర్డర్ సిబ్బంది ని చేసారు. సాయంత్రం పూట కర్ఫ్యూ సమయాన్ని ప్రజలకు మైక్ ఏర్పాటు చేసి తెలియపరచాలని ఎస్పీ ఆదేశించారు.

ఈ మేరకు మూడులాంతర్ల జంక్షన్ వద్ద లా అండ్ ఆర్డర్ డీఎస్పీ అనిల్ ,ట్రాఫిక్ డీఎస్పీ మోహన్ రావులకు ఎస్పీ ఆదేశించారు. ప్రభుత్వ ఉద్యోగులైతే ఐడీ కార్డు చూపించాలని ఆ విధంగా అలెర్ట్ చెయ్యాలని ఎస్పీ ఆదేశించారు.

Related posts

పుల్వామాలో ఉగ్రవాదుల దాడి: ఒక పోలీసు అధికారి మృతి

Satyam NEWS

జర్నలిస్టులతో అనుబంధం వీడదీయలేనిది: ఉప్పల్ ఎమ్మెల్యే బేతి సుభాష్ రెడ్డి

Satyam NEWS

రాజ్ భవన్ కాదు.. ప్రగతి భవన్ ముట్టడించాలి

Satyam NEWS

Leave a Comment