40.2 C
Hyderabad
April 29, 2024 18: 55 PM
Slider తెలంగాణ

మంత్రి రాక‌తో రైతుల్లో వెల్లివిరిసిన ఆనందం

Min-2

ఎమ్మెల్యే, విద్యాశాఖా మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ప‌లు శంకుస్థాప‌న‌లు, అధికారిక కార్య‌క్ర‌మాల్లో పాల్గొనేందుకు వెళ్లే క్ర‌మంలో మోమిన్ పేట మండ‌లం దేవ‌ర‌ప‌ల్లి గ్రామంలో రైతుల స్థితి గ‌తులు, కూర‌గాయాల ధ‌ర‌లు, వారికి అందుతున్న ప‌లు ప‌థ‌కాలు, త‌దిత‌ర విష‌యాల‌పై కూలంక‌షంగా వారితో మాట్లాడి తెలుసుకున్నారు. రైతు బంధు ఆర్థిక స‌హాయం అందిందా? అని ప్ర‌శ్నించ‌డం దీనికి అక్క‌డ కూర‌గాయ‌లు అమ్ముకుంటున్న వారు అందాయ‌ని స‌మాధానం చెప్ప‌డం మ‌రిన్ని వివ‌రాల గురించి ఆరా తీయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురి చేసింది. మంత్రి స్వ‌యానా ప్ర‌యాణిస్తున్న మార్గంలో ఉన్న‌ట్టుండి మార్గ‌మ‌ధ్యంలో ఎలాంటి భేష‌జాలు, భ‌ద్ర‌తా ప్ర‌మాణాల‌ను కాద‌ని రైతుల వ‌ద్ద‌కు నేరుగా వెళ్ళ‌డంతో ఆయా రైతులు, కూర‌గాయాల‌ను రోడ్ల‌పై అమ్ముకుంటున్న‌వారిలో ఆనందం వెల్లి విరిసింది.

రోడ్డు ప‌నుల‌కు శంకుస్థాప‌న‌

అనంత‌రం స‌బితా ఇంద్రారెడ్డి మోమిన్ పెట్ మండల కేంద్రం పిఎం జిఎస్ వై రోడ్డు పనులకు శంకుస్థాపన చేశారు. మోమిన్ పెట్ నుండి కోల్కుంద వరకు రూ. 3 కోట్ల 24 లక్షలతో నిర్మించనున్నరోడ్డు పనులకు ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ తో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ కార్య‌క్ర‌మంలో జడ్పీ వైస్ ఛైర్మన్ విజయ్ కుమార్, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు త‌దిత‌రులు పాల్గొన్నారు.

కోటీ రూపాయ‌ల‌తో గ్రంథాలయ ప‌నులు ప్రారంభం

అనంత‌రం మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి వికారాబాద్ జిల్లా కేంద్రంలో కోటి రూపాయల నిధులతో నిర్మిస్తున్ననూతన రీడింగ్ రూమ్ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. జిల్లా కేంద్ర గ్రంథాలయ ఆవరణలో జిల్లా గ్రంథాలయ చైర్మన్ కొండల్ రెడ్డి గారి అధ్యక్షతన జరిగిన శంకుస్థాపన కార్యక్రమంలో ఎంపీ మన్నే శ్రీనివాస్ రెడ్డి , ఎమ్మెల్యేలు మెతుకు ఆనంద్, కాలే యాదయ్య, నరేందర్ రెడ్డి, మహేష్ రెడ్డి, రాష్ట్ర గ్రంథాలయ సంస్థ ఛైర్మెన్ శ్రీధర్, విద్యా మౌలిక సదుపాయాల సంస్థ చైర్మన్ నాగేందర్ గౌడ్, రాష్ట్ర గ్రంథాలయ డైరెక్టర్ రమణ కుమార్, జడ్పీ వైస్ చైర్మన్ విజయ్ కుమార్, అడిషనల్ కలెక్టర్ చంద్రయ్య, మునిసిపల్ చైర్ పర్సన్ మంజుల, డిఈఓ రేణుక, లైబ్రరీ కార్యదర్శి హరిశంకర్, వివిధ మండలాల ప్రజాప్రతినిధులు, అధికారులు హాజరయ్యారు.

ఉన్న‌త విద్య‌తోనే నిరుపేద‌ల‌కు మేలు

ప‌లు కార్య‌క్ర‌మాల్లో పాల్గొన్నమంత్రి స‌బితా ఇంద్రారెడ్డి ఈ సంద‌ర్భంగా మాట్లాడుతూ.. టీఆర్ఎస్ పార్టీ రైతుల శ్రేయ‌స్సుకోరే పార్టీ అని, రైతుల ప‌ట్ల నిజ‌మైన ప్రేమ ఉన్న పార్టీ అని అన్నారు. ఎళ్ళ‌వేళ‌లా నిరుపేద‌ల బాగోగుల గురించి, సంక్షేమ ప‌థ‌కాలు అంద‌జేయ‌డంలో ముందున్నది కేసీఆర్ ప్ర‌భుత్వం అని గుర్తు చేశారు. అలాగే రాష్ర్టంలో విద్య‌లో అంద‌రూ ముందుండాల‌నే ఉద్దేశ్యంతో పాఠ‌శాల‌ల రూపురేఖ‌ల‌ను మార్చిత‌మ‌దైన శైలిలో నిరుపేద‌లంద‌రికీ ఉన్న‌త విద్య అందించాల‌నే ఉన్న‌త‌మైన ల‌క్ష్యంతో కేసీఆర్ స‌ర్కార్ ముందుకు వెళుతోంద‌న్నారు. ఇందులో భాగంగానే వికారాబాద్ జిల్లాలో అన్నినియోజ‌క‌వ‌ర్గ కేంద్రాల్లో గ్రంథాల‌యాలు (ఆధునిక హంగుల‌తో) ఏర్పాటు చేయాల‌ని సీఎం కేసీఆర్ నిర్ణ‌యించార‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు. చ‌దువుల త‌ల్ల స‌ర‌స్వ‌తి నిల‌యం వికారాబాద్ జిల్లాయేన‌ని మంత్రి కొనియాడారు. విద్యాహ‌బ్‌గా వికారాబాద్‌పై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి సారించింద‌న్నారు. అంతేగాకుండా వికారాబాద్‌లో స్ట‌డీ సెంట‌ర్‌ను కూడా ఏర్పాటు కోసం సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ‌తామ‌న్నారు. ఇటీవ‌ల కాలంలో క‌రోనాతో ఇబ్బందులు ప‌డుతున్న ప్ర‌పంచం, దేశం, రాష్ర్టం విద్యార్థులు, వారి వారి త‌ల్లిదండ్రుల ఇబ్బందుల‌ను దృష్టిలో ఉంచుకొని పై త‌ర‌గ‌తుల‌కు ప్ర‌మోట్ చేశామ‌ని స్ప‌ష్టం చేశారు. ఇక‌ప్ర‌భుత్వ, ప్రైవేట్ పాఠ‌శాల‌ల ప్రారంభ స్థితి గ‌తుల‌పై సీఎం కేసీఆర్ పూర్తిగా దృష్టి సారించార‌ని పేర్కొన్నారు.

వికారాబాద్‌లో ప‌రిశ్ర‌మ‌ల స్థాప‌న‌

వికారాబాద్ జిల్లాలో పరిశ్రమల స్థాపనకు కేటీఆర్ ఇప్ప‌టికే ఆదేశాలు జారీ చేశార‌ని, వికారాబాద్, తాండూరు, పరిగి, చేవెళ్ల, కొడంగల్ నియోజకవర్గాలలో పరిశ్రమల స్థాపనకు అనువైన స్థలాలల‌ను ఎంపిక చేసి యువతకు ఉపాధి అవకాశాలు మెరుగైన ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయ‌ని మంత్రి పేర్కొన్నారు. అంతేగాకుండా ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయానికి ప్రాముఖ్యత నిస్తోంద‌న్నారు.

ఉద్యోగ క‌ల్ప‌న‌లో స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న‌

ఉద్యోగాల‌కు సంబంధించి విద్యాశాఖలో ఉన్నభర్తీకి సీఎం ఇప్ప‌టికే స్ప‌ష్ట‌మైన ప్ర‌క‌ట‌న చేశార‌న్నారు. 50 వేల ఖాళీల భర్తీకి అధికారుల‌కు ఆదేశాలు జారీ చేయ‌డం సంతోష‌క‌ర‌మ‌న్నారు. దీంతో నిరుద్యోగుల స‌మ‌స్య‌లు పూర్తిగా తీరుతాయ‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి పేర్కొన్నారు.

అంద‌రి స‌ర్కార్ కేసీఆర్‌

దేశంలో ఎక్కడ లేని విధంగా పొలాల్లో పంటలుకొన్నఏకైక ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది కేసీఆర్ స‌ర్కారేన‌ని స్ప‌ష్టం చేశారు. అంతేగాకుండా మహిళలు, చిన్న పిల్లలు, సీనియ‌ర్ సిటిన్‌ల కోసం ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించ‌డం చూస్తుంటే వారిప‌ట్ల ఎంత నిబ‌ద్ధ‌తో కేసీఆర్ ప‌ని చేస్తున్నార‌నే విష‌యం ఇట్టే అర్థ‌మ‌వుతోంద‌ని స్ప‌ష్టం చేశారు.

ప‌ర్యాట‌కంలో తెలంగాణ నెం.1 ఆలోచ‌నలో సీఎం

ఇక అంతిమంగా తెలంగాణ రాష్ర్టాన్ని ప‌ర్యాట‌కంగా కూడా అభివృద్ధి చేయాల‌నే ఆలోచ‌న‌లో సీఎం కేసీఆర్ ముందు చూపుతో వ్య‌వ‌హ‌రిస్తున్నార‌ని ఇందులో భాగంగానే ఆయా జిల్లాలో ఏయిర్‌పోర్ట్‌ల కోసం కేంద్రం అనుమ‌తి కోరార‌ని మంత్రి వివ‌రించారు. ప‌ర్యాట‌కంగా తెలంగాణ అభివృద్ధి చెందితే దీని ద్వారా కూడా మ‌రింత మందికి ఉద్యోగ, ఉపాధి అవ‌కాశాల కొద‌వ భ‌విష్య‌త్‌లో త‌లెత్త‌బోద‌ని మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి స్ప‌ష్టం చేశారు.

Related posts

హిందువుల మనోభావాలను దెబ్బతీసే పోస్టింగులపై ఫిర్యాదు

Satyam NEWS

ఫిబ్రవరి 12 న విద్యావంతులైన నిరుద్యోగుల సదస్సు

Satyam NEWS

కాంగ్రెస్ పార్టీ ములుగు పట్టణ అధ్యక్షులుగా వంగ రవి యాదవ్

Satyam NEWS

Leave a Comment