28.7 C
Hyderabad
May 5, 2024 07: 38 AM
Slider ముఖ్యంశాలు

466 అంబులెన్సులు ప్రారంభం

#Minister Harish Rao

తెలంగాణ ప్రభుత్వం కొత్తగా 466 అంబులెన్స్‌లను ప్రారంభించడం సంతోషంగా ఉందని మంత్రి హరీష్ రావు అన్నారు. హైదరాబాద్‌లోని పీపుల్స్ ప్లాజా వద్ద రాష్ట్ర ప్రభుత్వం 466 నూతన అంబులెన్స్ వాహనాల ప్రారంభోత్సవం కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా మంత్రి హరీష్ రావు మాట్లాడుతూ..

రాష్ట్రం ఏర్పడే నాటికి ప్రతి లక్ష జనాభాకు ఒక అంబులెన్స్ ఉండేదని.. ప్రస్తుతం 75 వేల మందికి ఒక అంబులెన్స్ ఉందని తెలిపారు. అమ్మఒడి వాహనాలు కావాలని కోరగానే సీఎం కేసీఆర్ నిధులు ఇచ్చారన్నారు. జననం నుంచి మరణం వరకు వైద్య, ఆరోగ్య సేవలు అందిస్తుందని చెప్పారు.

తెలంగాణ వైద్య, ఆరోగ్య శాఖలో సీఎం కేసీఆర్ ఐదు అంచెల వ్యవస్థను ఏర్పాటు చేశారని తెలిపారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖను నీతి ఆయోగ్ సైతం అభినందించిందని గుర్తు చేశారు. ప్రపంచాన్నే గడగడలాడించిన కరోనా మహ్మమారి కంటే పెద్ద జబ్బులు వచ్చిన తెలంగాణ తట్టుకుంటుందని అన్నారు.

ఆరోగ్య రంగంలో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు. దేశంలో కొన్ని రాష్ట్రాల్లో స్కామ్‌లు ఉంటే.. తెలంగాణలో స్కీమ్‌లు ఉన్నాయన్నారు. అంబులెన్స్‌లను డైనమిక్ పొజిషన్ చేయాలనుకుంటున్నామని చెప్పారు. 108 ఉద్యోగులకు నాలుగు స్లాబులుగా వేతనాలు పెంచుతామని మంత్రి హరీష్ రావు గుడ్ న్యూస్ చెప్పారు.

Related posts

దేశ వ్యాప్తంగా ఈనెల 24న జరిగే సమ్మెను జయప్రదం చేయండి

Satyam NEWS

పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

Satyam NEWS

తాగు నీటి సమస్యను పరిష్కరించిన అంబర్ పేట్ ఎమ్మెల్యే

Satyam NEWS

Leave a Comment