Slider ఖమ్మం

పట్టణ ప్రగతిలో ప్రజల భాగస్వామ్యం తప్పనిసరి

minister puvvada 03

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పటిష్ట ప్రణాళికతో చేపట్టిన పట్టణ ప్రగతి పూర్తి స్థాయిలో విజయవంతం కావాలంటే ప్రజలను భాగస్వామ్యం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ అన్నారు. తొలుత నగరంలోని పలు ప్రాంతాల్లో సందర్శించారు.

వైరా చెరువును పరిశీలించి జరుగుతున్న పనుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అక్కడే ఉన్న సెరికల్చర్ స్థలంలో వైకుంఠధామం ఏర్పాటు చేయాలని ఎమ్మెల్యే రాములు నాయక్ విజ్ఞప్తి మేరకు ఆయా ఏర్పాటు చేయాలని అదనపు కలెక్టర్ కు సూచించారు. అనంతరం వైరా మున్సిపాలిటీ ఆవరణంలో జరిగిన పట్టణ ప్రగతి సభలో మాట్లాడుతూ పల్లె, పట్టణ ప్రగతి గొప్ప సాంఘీక మార్పుకు నాంది కాబోతోందని, పట్టణాలలో ఖాళీ స్థలాలు మరుగుకు నిలయాలు అవుతున్నాయని మంత్రి అన్నారు.

అందుకే ఖాళీ స్థలాలను బాగు చేసి ఆయా యజమానికి రెట్టింపు బిల్లు పంపాలని అధికారులను ఆదేశించారు. అప్పటికి స్పందించకుంటే అక్కడ మున్సిపల్ కార్యాలయం బోర్డ్ పాతండి అని మంత్రి సూచించారు. పట్టణ అభివృద్ధి కోసం ప్రతి వార్డులో వార్డ్ కమిటీలు ఉండాలి. అందులో 60 మంది సభ్యులు ఉండాలి.

వారు మన పట్టణం, మన వార్డు, మన మున్సిపాలిటీ సమస్యలు తెలుసుకోవాలి. ప్రధానంగా తడి చెత్త పొడి చెత్తను కచ్చితంగా విడి చేయాలి. తడి, పొడి చెత్త ను విడి విడిగా సేకరించాలి.  TUFIDC నిధుల ద్వారా చెత్త సేకరణకు మినీ వ్యాన్ లేక ఆటోలు కొనాలి. వైరా మున్సిపాలిటీలో 20 మినీ వ్యాన్లు ఉండాలన్నారు.

ప్లాస్టిక్ నిర్ములనకు శాశ్వత చర్యలు అవసరం. మనం కలిసికట్టుగా పూనుకోవాలి. ప్లాస్టిక్ ఫ్రీకి అధిక ప్రాధాన్యత ఇవ్వాలి. ప్రతి ఇంటికి జ్యూట్ బ్యాగ్ ఉండాలి అని మంత్రి అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ స్నేహాలత మోగిలి, ఎమ్మెల్యే రాములు నాయక్, మున్సిపల్ చైర్మన్ సూతగాని జైపాల్,  డీసీసీబీ డైరెక్టర్ బొర్రా రాజశేఖర్, మున్సిపల్ కమిషనర్ తదితరులు ఉన్నారు.

Related posts

డ్రగ్స్ వద్దు, ఆరోగ్యం ముద్దు: వనపర్తి డిఎస్పీ

Satyam NEWS

అహంకారం…అహంకారం.. అహంకారం అదే అమెరికాకు శాపం

Satyam NEWS

అమరావతి పేరు కూడా వినిపించకుండా పక్కా ప్లాన్

Satyam NEWS

Leave a Comment