28.7 C
Hyderabad
May 6, 2024 02: 28 AM
Slider నల్గొండ

మున్సిపాలిటీలో 5 రూపాయల భోజన పథకం అమలు చేయాలి

#daggubati

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదల  కొరకు ఏర్పాటు చేస్తున్న 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకాన్ని మున్సిపాలిటీలలో కూడా అమలు చేయాలని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు ప్రభుత్వాన్ని కోరారు. 

సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్, నేరేడుచర్ల మున్సిపాలిటీలో కూడా 5 రూపాయల అన్నపూర్ణ భోజన పథకాన్ని ఏర్పాటు చేయాలిని,శాసనసభ్యుడు శానంపూడి సైదిరెడ్డి చొరవ తీసుకొని నిరుపేదల కొరకు అన్నపూర్ణ క్యాంటీన్  ఏర్పాటు చేయాలని బాబురావు కోరారు.

నియోజకవర్గ పరిధిలో అనేకమంది అనాధలు,అభాగ్యులు,రహదారిపై  భిక్షాటన చేసే వికలాంగులు,వృద్ధులు, నిరుపేదలకు,బడుగు,బలహీనులకు అన్నపూర్ణ భోజన పథకం ఒక పూట ఆకలి బాధను తీరుస్తుందని,జానెడు పొట్టకు గుప్పెడు మెతుకుల అన్నం ఆకలిని తీర్చుతుందని,ఇది మానవత్వానికి మచ్చుతునక అన్నపూర్ణ క్యాంటీన్ అని అన్నారు.

సూర్యాపేట,కోదాడ మున్సిపాలిటీలలో గత రెండు,మూడు సంవత్సరాల నుంచి ఐదు రూపాయల భోజనం పథకం అమలు అవుతుందని,అదే విధంగా హుజూర్ నగర్,నేరేడుచర్ల మున్సిపాలిటీలో కూడా అమలు చేయాలని,రాష్ట్ర ప్రభుత్వం పేదవారిని పట్టించుకొని వారి ఆకలి తీర్చడానికి కృషి చేయాలని డి ఎస్ ఆర్ ట్రస్ట్ చైర్మన్ దగ్గుపాటి బాబురావు పత్రికా ముఖంగా తెలిపారు.

ఈ కార్యక్రమంలో డి ఎస్ ఆర్  ట్రస్ట్ సభ్యులు లచ్చిమల్ల నాగేశ్వరరావు, కోల్లపూడి కళ్యాణ్,మామిడి అశోక్, దగ్గుపాటి కవిత,పొదిల తిరుపతి,కుడితేటి ఆమోష్,కోళ్లపూడి ప్రశాంత్,మామిడి సామెల్,బాయమ్మ,పిఎన్ఆర్ టైలర్ పాశం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్, హుజూర్ నగర్

Related posts

రోడ్డు ప్రమాదంలో ఆర్టీసీ ఉద్యోగులు మృతి

Satyam NEWS

కీసరలో రేవ్ పార్టీపై పోలీసుల దాడి: దొరికిన అమ్మాయిలు

Satyam NEWS

చంద్రయాన్-3 విజయవంతం భారతీయులందరికి గర్వకారణం

Bhavani

Leave a Comment