27.7 C
Hyderabad
May 4, 2024 10: 32 AM
Slider మహబూబ్ నగర్

మహాత్మా గాంధీ లిఫ్ట్ ఇరిగేషన్ కు 50 కోట్లు విడుదల

#Kalwakurthy Lift Irregation

నాగర్ కర్నూలు జిల్లా కల్వకుర్తి మండలం లోని మహాత్మాగాంధీ కల్వకుర్తి లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ కింద 50 కోట్లు ఈ వారంలో విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రెటరీ ని తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట చంద్రశేఖర్ రావు ఆదేశించారని కల్వకుర్తి ఎమ్మెల్యే గూర్ఖా జైపాల్ యాదవ్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాకేజీ నెంబర్ 29 ఇది డిస్ట్రిబ్యూటర్- 82( D .82) ఆదివారం  ముఖ్యమంత్రి చంద్రశేఖర రావును ప్రగతి భవన్ లో ఉదయం 11 గంటల నుండి మధ్యాహ్నం 3 గంటల వరకు సమగ్రమైన సమీక్ష సమావేశం జరిగిందని, సమీక్ష సమావేశానికి ఆయనతోపాటు మంత్రి ఎస్ నిరంజన్ రెడ్డి , ఎంపి. పి శ్రీరాములు, ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి , మురళీధర్ రావు ,సి ఈ అనంత రెడ్డి ,ఈ ఈ శ్రీకాంత్ ఈ సమావేశానికి హాజరయ్యారని ఆయన తెలిపారు.

డి 82 జంగారెడ్డి పల్లి నుండి నాగిళ్ల వరకు 60 కిలోమీటర్ల యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అదనంగా 40 వేల ఎకరాలకు సాగునీరు ఇవ్వాలని సమీపంలో ఉన్న చెరువులు నింపాలని భూములు కోల్పోయిన రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వాలని కే సీ ఐ ఇంజనీర్లు ప్రిన్సిపల్ సెక్రెటరీ రంజిత్ కుమార్ ,ముఖ్యమంత్రి  ప్రత్యేక కార్యదర్శి స్మితాసబర్వాల్ ను, రెండు జిల్లాల కలెక్టర్లను, ఆర్ డి వో లకు ఆదేశించారని అని ఆయన పేర్కొన్నారు.

ఇందుకు మొదట ఈ వారం లో 50 కోట్ల రూపాయలు విడుదల చేయాలని ఫైనాన్స్ సెక్రటరీని ఆదేశించారని ఆయన అన్నారు. మొత్తం 150 కోట్ల లను విడతలవారీగా విడుదల చేయనున్నట్లు తెలిపారు.  వంగూరు చారగొండ వెల్దండ ఆమన్గల్ మాడ్గుల కల్వకుర్తి నియోజక ప్రజలకు కాలువల వెంట ఉండి పని చేయించి రైతాంగానికి సాగునీరు అందించే ఆదుకుంటానని హామీ ఇస్తూ అన్ని విధాల సహకరిస్తారని ఎమ్మెల్యే జైపాల్ యాదవ్  విజ్ఞప్తి చేశారు.

Related posts

పీడీఎస్ సరుకు అక్రమ సరఫరా ను అడ్డుకున్న విజయనగరం బీజేపీ

Satyam NEWS

వనపర్తి డిపిఆర్ఓగా పి. సీతారాం నాయక్ కు పదోన్నతి

Satyam NEWS

భర్త కలల్ని తనవిగా భావించే భార్యలకు అంకితం

Satyam NEWS

Leave a Comment