38.2 C
Hyderabad
April 28, 2024 22: 35 PM
Slider సినిమా

భర్త కలల్ని తనవిగా భావించే భార్యలకు అంకితం

deepika

ఒకప్పటి స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ జీవితం ఆధారంగా నిర్మిస్తున్న చిత్రం 83. ఈ చిత్రంలో కపిల్ దేవ్ పాత్రను రణ్ వీర్ సింగ్ పోషిస్తున్నారు. ఆయన భార్య రోమీ పాత్రను దీపికా పదుకొనే పోషిస్తున్నారు. కపిల్ దేవ్ జీవితంలో మైలు రాయిగా నిలిచిపోయిన భారత జట్టు తొలి సారి క్రికెట్ ప్రపంచ కప్ విజయోత్సవం ఈ చిత్రం కీలక అంశం. 1983లో జరిగిన ఈ అద్భుత సన్నివేశాన్ని చిత్రంగా కబీర్ ఖాన్ రూపొందిస్తున్నారు.

నిజజీవితంలో భార్యా భర్తలైన రణ్ వీర్ సింగ్ దీపికా పదుకొనే లు కలిసి నటిస్తున్న చిత్రం ఇది. దేశానికి గర్వ కారణంగా నిలిచిన సంఘటన ఆధారంగా తీసిన చిత్రంలో నటించడం ఆనందంగా ఉందని ఈ సందర్భంగా దీపిక అన్నారు. తన కలల కన్నా కూడా భర్త కలలనే తన కలలుగా భావించే భార్యలకు ఈ చిత్రం అంకితమని దీపిక అన్నారు.

Related posts

మల్లికార్జున్ మరణం బాధాకరం: సబ్ రిజిస్ట్రార్ తస్లీమా

Satyam NEWS

మే 10న ఇంటర్‌, మే 15న టెన్త్‌ ఫలితాలు?

Satyam NEWS

డిమాండ్: వలసకూలీలను ప్రభుత్వం ఆదుకోవాలి

Satyam NEWS

Leave a Comment