ఈ తీరని అలసట(క్రానిక్ ఫాటిగ్యూ సిండ్రోమ్ -సి.ఎఫ్.ఎస్.) కొత్తదేమీ కాదు. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని వేధిస్తున్న సమస్య ఇది. మనదేశంలో (6 కోట్లు) తెలుగు రాష్టాలలో(75-80 లక్షలు)నూ ఈ రుగ్మతతో బాధపడుతున్నారు. దీనికి సంబంధించి ఇటీవలి వరకూ వైద్యపరంగా సరైన అవగాహన లేకపోవటం వల్ల చాలా మంది డాక్టర్లు కూడా వ్యక్తులు తమ ఆరోగ్యానికి సంబంధించి అనవసర అనుమనాలు పెంచుకుని తాము అనారోగ్యానికి గురయినట్లు తమకు తాము నమ్మకంగా చెప్పుకోవటంగా పరిగణిస్తున్నారు.
ఈ లక్షణాలకు మానసిక కారణం తప్పించి (సైకోసొమాటిక్) తప్పించి నిజంగా వ్యాధీ ఏమీ లేదని కూడా భావిస్తున్నారు. చాలా కుటుంబాలలో సి.ఎఫ్.ఎస్. బాధితుల సమస్యను ప్రధానంగా మానసికమైనది (సైకోసొమాటిక్)గానో, శ్రమపడటానికి సిద్దంలేని తనంగానో పరిగణిస్తున్నారు. కుటుంబ సభ్యులు ఇతరుల అభిప్రాయానికి భిన్నంగా పలు సందర్బాలలో ఆ వ్యక్తుల్లో పనులు చేయటానికి, ఉత్సాహావంతమైన జీవితం గడపటానికి ఆసక్తి చూపటం, అలసటను విస్మరించి పనిచేయాలని ఉన్నప్పటికీ వారి శరీరం అందుకు సహకరించకపోవటాన్నిచూస్తుంటాము.
ఇతరత్రా ఏ వ్యాధులు లేని వ్యక్తులలో ఈ నిరంతర నిస్సత్తువ రామ్మోహన్ ఆర్. అప్పరసును తరచూ ఆలోచనలో పడవేసింది. తెలంగాణలోని ప్రధాన కార్పోరేట్ ఆస్పత్రికి 20 నెలల పాటు హెల్త్ కంటెంట్ డెవలప్మెంట్ కన్సల్టెంటుగా ఆయన పనిచేసిన కాలంలో ఈ తీరని అసట గూర్చి ఆయన అధ్యయనం చేశారు. అంతర్జాతీయ హెల్త్ కంటెట్ డెవలప్ మెంట్ నిపుణుల సలహాతో చేసిన అధ్యయనంలో తెలుసుకున్న విషయాలను అంతర్జాతీయ స్థాయిలో జరిగుతున్న పరిశోధనలు- పరిణామాల సారాంశాన్ని, సిఫార్సులను ఈ చిన్న పుస్తకం రూపంలో పాఠకులతో పంచుకుంటున్నారాయన.
ఇందుకు రెండు కారణాలున్నాయని రామ్మోహన్ అంటున్నారు. ఈ వ్యాధితో బాధపడతున్న వ్యక్తులు ఉన్న కుటుంబాలవారు- బంధుమిత్రులు వారి సమస్యను అర్థం చేసుకోవటం ద్వారా ఆ వ్యక్తులకు అండగా నిలిచేందుకు ఉపయోగపడటం. తమ తీరని అలసటకు కారణం అర్థంకాక సి.ఎఫ్.ఎస్. వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులకు అవగాహన కల్పించటం. వారు తమ సమస్యను అధిగమించేందుకు తోడ్పడగల విశ్వసనీయ ఆరోగ్యసమాచారాన్ని అందించటం. అందుకోసమే ఈ పుస్తకాన్ని విడుదల చేస్తున్నటుల్ రామ్మోహన్ ఆర్. అప్పరసు తెలిపారు. ఈ పుస్తకాన్ని మినిమీడియా వారు ప్రచురించగా రీచౌట్ మార్కెటింగ్ వారు మార్కెటింగ్ చేస్తున్నారు.