38.2 C
Hyderabad
May 5, 2024 21: 58 PM
Slider ఖమ్మం

గుడుంబాకి బానిసలుగా మారి దొంగతనాలకు పాల్పడుతున్న ముఠా

#Gudumba

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బూర్గంపహడ్ మండల కేంద్రంలో ఓ దొంగ ముఠా సంచరిస్తున్నట్లు విస్వానియత సమాచారం,సాధారణంగా కోన్ని దొంగ ముఠాలు బంగారం,డబ్బు అంతస్థుల కోసం దొంగతనాలు చేస్తూ ఉంటారు,కానీ బూర్గంపహాడ్ మండల కేంద్రంలో ఆ దొంగ ముఠా బంగారం,డబ్బు కి ఆశపడి మాత్రం దొంగతనాలు చేయడంలేదు కేవలం గుడుంబా కోసమే వారు దొంతనాలకు పాల్పడుతున్నారు,గుడుంబాకి బానిసలుగా మారుతున్న ఈ దొంగ వ్యక్తులు,గుడుంబా కుతితో,గుడుంబా కొనుగోలు చేయడానికి డబ్బులు లేక దొంగతనాలకు పాల్పడుతుంటారు.

ఈ దొంగల ముఠా స్థావరం మండల కేంద్రంలోని బూర్గంపహాడ్ పాత బస్టాండ్ తో పాటు,బస్ ఫ్యాలేస్ కుడా ఒకటి ఈ దొంగ ముఠా ఉదయం బస్త సంచులు బుజనా వేసుకొని చెత్త పేపర్లు,ప్లాస్టిక్ ని ఎరుతున్నట్లు నటిస్తూ మండలంలో పలు చోట్ల దొంగతనాలకు పాల్పడుతుంట్టారు.

ముందుగా ఏమి తెలియని అమాయక యాచకుల అవతారంలో వాడ,వాడలా తిరుగుతూ వారి దొంగతన ప్రదేశాలు ఎంచుకుంటారు.మండల కేంద్రంలో గుడుంబా ప్యాకెట్లు తాగుతూ తెల్లవార్లూ తిరిగి ఏమి ఎరగనట్టు వారి దొంగతనం పూర్తి చేసి అతి తక్కువ ధరకు ఆ వస్తువులను అమ్మి జలసాగా గుడుంబా సేవించి వారి స్థావరాల వద్ద బొక్కబోర్లాపడి నిద్రిస్తుంటారు, ఒక్కో సమయంలో గుడుంబా మైకం తలకు ఎక్కి రోడ్డు పక్కనే ప్రయాణికులతో గొడవలు పడుతూ వారిని డబ్బులు అడుక్కుంటూ,రోడ్ల పక్కనే పడుకుంటారు గత కొద్ది రోజులుగా మండల కేంద్రంలో పాటు మండలంలో కుడా పలు దొంగతనాలు జరుగుతున్నాయి.

ఇంటి దొంగ ఈశ్వరుడుకే చిక్కడు అనే తరహాలో ఈ దొంగలు గ్రామంలో నటిస్తూ తిరుగుతున్నారు.ఈ క్రమంలోనే ఈ ముఠాలో ఇద్దరు దొంగలు పాల్వంచ మండల పరిధిలోని నాగరం అనే గ్రామంలో రైతులకు సంబంధిత నీటి మోటర్లలో ఉన్న కాఫర్ వైర్లను దొంగిలిస్తున్నారు ఈ ఇద్దరు వ్యక్తులు దొంగతనం చేసి స్థానిక రైతులకు అడ్డంగా పట్టు బడగ,అందులో ఒక దొంగ పరారీ కాగా మరొకరిని చెట్టుకు కట్టేసి రైతులు వారు చేసే దొంగతనాలు చెప్పే విధంగా విచారించి స్థానిక పోలీసులకు అప్పగించినట్టు సమాచారం.పలు మార్లు ఈ దొంగలు మండల పరిధిలో దొంగతనాలు చేసి దెబ్బలు తిన్న సందర్బాలు కుడా ఉన్నట్టు వినికిడి.

Related posts

ఆకట్టుకున్న డాగ్ షో: కుమారుడితో సహా హాజరైన విజయనగరం ఎస్ పి

Satyam NEWS

వినాయక మండపాలకు అనుమతి నిరాకరణ పై భజరంగ్ దళ్ నిరసన

Satyam NEWS

అల వైకుంఠ పురములో రాములో రాములా

Satyam NEWS

Leave a Comment