32.2 C
Hyderabad
May 13, 2024 21: 07 PM
Slider సంపాదకీయం

మజ్లీస్ బీఆర్ఎస్ మధ్య పెరుగుతున్న అగాధం

#kcr

ఎంతో కాలంగా చెట్టపట్టాలు వేసుకుని తిరుగుతున్న బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీల మధ్య పొసగడం లేదా? తాజా పరిణామాలు చేస్తుంటే వచ్చే ఎన్నికల నాటికి బీఆర్ఎస్, మజ్లీస్ పార్టీలు బద్ధ శత్రువులుగా మారే సూచనలు కనిపిస్తున్నాయని రాజకీయ పండితులు అంటున్నారు.

ఈ రెండు పార్టీల మధ్య ఏం జరిగిందో ఏమో తెలియదు కానీ ఈ మధ్య కాలంలో మజ్లీస్ అగ్ర నేత అసదుద్దీన్ ఒవైసీ అధికార బీఆర్ఎస్ పార్టీని విమర్శిస్తున్నారు. బీఆర్ఎస్ పార్టీలో ఎన్నికల పొత్తు లేకపోయినా కూడా మజ్లీస్ పార్టీకి ఇచ్చిన ప్రాధాన్యతను బీఆర్ఎస్ నేతలు మరీ ముఖ్యంగా కేసీఆర్ వేరే ఏ పార్టీకీ ఇవ్వడం లేదు.

ఒక దశలో కాంగ్రెస్ పార్టీ నుంచి ప్రధాన ప్రతిపక్ష హోదా తీసేసి మజ్లీస్ కు ఇవ్వాలని కూడా తెలంగాణ సీఎం కేసీఆర్ ఆలోచించారు. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేలను మూకుమ్మడిగా తీసేసుకున్న కేసీఆర్ ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా లేకుండా చేద్దామని భావించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి ముందు నుంచి మజ్లీస్ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా పని చేసింది. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే బీజేపీ పుంజుకుంటుందని అప్పటిలో మజ్లీస్ పార్టీ అంచనా వేసుకున్నది.

దానికి తోడు బీజేపీ కూడా ప్రత్యేక తెలంగాణ ను సమర్థించడంతో మజ్లీస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును వ్యతిరేకించింది. నేపథ్యం ఇలా ఉన్నా కూడా ప్రత్యేక తెలంగాణ ఏర్పాటు అయిన తర్వాత నుంచి అప్పటి తెలంగాణ రాష్ట్ర సమితి ఇప్పటి బీఆర్ఎస్ పార్టీతో మజ్లీస్ చెట్టాపట్టాలు వేసుకుని తిరిగింది.

బీఆర్ఎస్ అధినేత, ముఖ్యమంత్రి కేసీఆర్ కూడా మజ్లీస్ నాయకులను తన సొంత మనుషులు అన్నట్లు గానే ప్రవర్తించారు. అందుకే బీఆర్ఎస్ గుర్తు అయిన కారు కు స్టీరింగ్ మజ్లీస్ వద్ద ఉన్నదని బీజేపీ నాయకులు తరచూ ఆరోపిస్తుండేవారు. ఏ ముఖ్య నిర్ణయం తీసుకున్నా కూడా మజ్లీస్ కు ముందుగా చెప్పాలని కూడా కేసీఆర్ నిర్ణయించుకుని అదేమాదిరిగా వ్యవహరించారు.

మజ్లీస్ పార్టీ దేశంలోని మిగిలిన రాష్ట్రాలలో పోటీ చేయాలని నిర్ణయించుకున్న సమయంలో కూడా కేసీఆర్ తన పూర్తి మద్దతును ఆ పార్టీకి ప్రకటించారు. మజ్లీస్ పార్టీ పోటీ చేయడం వల్ల తమ ఓట్లు చీలిపోతున్నాయని, ఇది పరోక్షంగా బీజేపీకి లాభం చేకూరుస్తున్నదని కాంగ్రెస్ పార్టీ నెత్తీనోరూ బాదుకున్నా కూడా మజ్లీస్ పార్టీ తన పంథా మార్చుకోలేదు.

మజ్లీస్ పార్టీ పోటీ చేసిన ప్రతి చోటా ముస్లీం ఓట్లన్నీ ఆ పార్టీకే పోలయ్యేవి. దాంతో కాంగ్రెస్ అభ్యర్ధి ఓడిపోయేవాడు…. ఇప్పుడు దేశంలో రాజకీయ పరిస్థితులు వేగంగా మారుతున్నాయి. బీఆర్ఎస్ పార్టీ జాతీయ పార్టీగా ఆవిర్భవించి ఇతర రాష్ట్రాలలో కూడా పోటీ చేయబోతున్నది. తాజా పరిణామాలలో కేసీఆర్ కు ఒవైసీకీ మధ్య ఏం జరిగిందో తెలియదు కానీ ఒవైసీ ఈ మధ్య తరచుగా కేసీఆర్ ను విమర్శిస్తున్నారు.

రాష్ట్రంలో ధరణి పోర్టల్ వల్ల ఎంతో నష్టం జరుగుతున్నదని, తక్షణమే ధరణి పోర్టల్ ను రద్దు చేయాలని ఒవైసీ తీవ్రంగా విమర్శించారు. కేసీఆర్ నీమ్స్ (నిజాం ఇన్ స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్) విస్తరణ నిర్ణయం తీసుకోగానే ఒవైసీ దాన్ని తీవ్రంగా వ్యతిరేకించారు. తాము ఎప్పటి నుంచో ఉస్మానియా ఆసుపత్రిని ఆధునీకరించాలని కోరుతున్నా సీఎం కేసీఆర్ పట్టించుకోవడం లేదని, ఇప్పుడు నీమ్స్ ను ఉద్ధరించాలని చూస్తున్నారని ఒవైసీ విమర్శించారు. ఇలా చిన్న విషయం నుంచి పెద్ద విషయం వరకూ కేసీఆర్ ను ఒవైసీ విమర్శించడం పలువురిని ఆశ్చర్య పరుస్తున్నది.

Related posts

రేవంత్ రెడ్డికి వ్యతిరేకంగా కాంగ్రెస్ నేతల కుట్ర?

Satyam NEWS

రాపిడ్ టెస్టు కిట్లకు వెంకయ్య సర్టిఫికెట్

Satyam NEWS

కరోనా నియంత్రించకుంటే భవిష్యత్తు ఉండదు

Satyam NEWS

Leave a Comment