30.7 C
Hyderabad
April 29, 2024 03: 58 AM
Slider ముఖ్యంశాలు

కరోనా నియంత్రించకుంటే భవిష్యత్తు ఉండదు

#Minister Etala Rajendar

రాష్ట్రంలో పెరుగుతున్న కరోనా పాజిటీవ్ కేసులపై సత్వర చర్యలు తీసుకోకపోతే రాష్ట్రానికి భవిష్యత్తు ఉండదని కాంగ్రెస్ శాసనసభా పక్షం వ్యాఖ్యానించింది. ఈ మేరకు సీఎల్పీ లీడర్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క, సీనియర్ ఎమ్మెల్యే దుద్దిళ్ల శ్రీధర్ బాబు రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి ఈటల రాజేందర్ ను కలిసి వినతి పత్రం సమర్పించారు.

కరోనా కట్టడిలో ప్రభుత్వం ఎలాంటి పొరబాట్లకు తావి ఇవ్వరాదని వారు కోరారు. రాష్ట్రంలో అనునిత్యం పెరుగుతున్న కరోనా వ్యాధి పై నిర్దుష్టమైన చర్యలు తీసుకోవాలని వారు కోరారు. కరోనా నిర్మూలనకు ప్రభుత్వం గట్టి చర్యలు తీసుకోవాలని వారన్నారు.

అదే విధంగా ప్రజలకు ఎక్కువ మొత్తంలో రాష్ట్రంలో పరీక్షలు జరిపించాలని కాంగ్రెస్ నాయకులు కోరారు. పేద ప్రజల నుంచి ప్రైవేట్ ఆస్పత్రి వారు లక్షలాది రూపాయలు ఫీజు వసూలు చేస్తున్నారని ఇది అన్యాయమని వారన్నారు. ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవలసిందిగా వినతి పత్రంలో పేర్కొన్నారు.

Related posts

ఫిబ్రవరి లో పోడు పట్టాల పంపిణీ

Murali Krishna

తొలకరి

Satyam NEWS

అరుదైన గ్రూప్ రక్తాన్ని దానం చేసిన స్కూలు టీచర్

Bhavani

Leave a Comment