31.2 C
Hyderabad
May 12, 2024 01: 46 AM
Slider చిత్తూరు

తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం..

#fire broke

తిరుపతి గోవిందరాజు స్వామి ఆలయం దగ్గర భారీ అగ్నిప్రమాదం జరిగింది. ఆలయానికి దగ్గర్లోనే ఉన్న ఫొటో ఫ్రేమ్ షాపులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం అందించారు. ఫైర్ సిబ్బంది మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ అగ్ని ప్రమాదానికి కారణం షార్ట్ సర్క్యూటే అని భావిస్తున్నారు.

అగ్ని ప్రమాదం జరిగిన తర్వాత ఫొటో ఫ్రేమ్ షాపులో వారు అక్కడి నుంచి తప్పించుకున్నారా లేదా అన్నది తెలియట్లేదు. మంటలు ఇప్పట్లో అదుపులోకి వచ్చేలా కనిపించట్లేదు. మంటలు చాలా వేగంగా ఇతర షాపులకు వ్యాపిస్తున్నాయి. అక్కడ గాలి బాగా వస్తుండటంతో… మంటలు వేగంగా ఎగసిపడుతున్నాయి.

ఈ ఫొటో ఫ్రేమ్ షాపులో రకరకాల ఫొటోలు, స్వామి వారి ఫొటోలు ఉంటాయి. ఈ షాపు ఉన్న సందులో ప్రజలు ఎక్కువగా వస్తూ, వెళ్తూ ఉంటారు. ఈ ప్రమాదం కారణంగా… అటువైపు రాకపోకలను రద్దు చేశారు. ఈ ప్రాంతంలో ప్రస్తుతం కరెంటు సరఫరా కూడా నిలిపివేశారు. మంటల్ని ఆర్పేందుకు ఫైర్ సిబ్బంది ఎంతగానో శ్రమిస్తున్నారు. ఓ గంటలో మంటలు అదుపులోకి రావచ్చు అంటున్నారు.

Related posts

సోమశిల హైస్కూల్ లో ఘనంగా గణిత దినోత్సవం

Satyam NEWS

ఐసిస్ మాడ్యూల్ కేసులో ప్రఖ్యాత పూణే వైద్యుడు అరెస్ట్

Satyam NEWS

విజయవంతంగా జీఎస్‌ఎల్‌వీ-ఎఫ్‌12 ప్రయోగం

Satyam NEWS

Leave a Comment