Slider వరంగల్

ములుగు జిల్లాలో తొలిమెట్టు పై సమీక్ష


తొలిమెట్టు కార్యక్రమం పై జిల్లా స్థాయి సమీక్ష సమావేశాన్ని ములుగు జిల్లా విద్యాశాఖ అధికారి జి.పాణిని నేడు నిర్వహించారు. ములుగు జిల్లా విద్యాశాఖ కార్యాలయం లో జరిగిన ఈ కార్యక్రమంలో ఆయన మండల విద్యాశాఖ అధికారులకు, FLN నోడల్ అధికారులకు, క్లస్టర్ నోడల్ అధికారులకు మార్గదర్శనం చేశారు. తొలిమెట్టు కార్యక్రమం ను సమర్థవంతంగా నిర్వహించి విద్యార్థుల అభ్యసన ఫలితాల సాధన కు కృషి చేయాలని చెప్పారు. తరగతి గదిలో బోధన అభ్యాసన కార్యక్రమం విధిగా పాఠ్య ప్రణాళికా ఆధారితంగా ఉండాలని సూచించారు. బోధనోపకరణాలు ఉపయోగించాలని చెప్పారు. ప్రతీ నెల చివర పరీక్ష నిర్వహించి ఫలితాలను స్టూడెంట్ లెర్నింగ్ ట్రాకర్ లో నమోదు చేయాలని చెప్పారు.

విద్యార్థుల ప్రగతి గురించి తల్లి తండ్రుల సమావేశంలో చర్చించాలని అధికంగా గైర్హాజరు అయ్యో పిల్లల తల్లి దండ్రులు కు అవగాహన కల్పించాలని చెప్పారు. ప్రతీ నెల మూడవ శనివారం బాల సభ ను నిర్వహించి విద్యార్థుల లో ఉన్న నైపుణ్యం ను అభివృద్ధి చేయాలని చెప్పారు ఈ కార్యక్రమం లో సమగ్ర శిక్ష క్వాలిటీ కో ఆర్డినేటర్ బద్దం సుదర్శన్ రెడ్డి, సాంబయ్య, రాజు DCEB సెక్రెటరీ విజయమ్మ,MEO లు శ్రీనివాసులు, రాజేష్, సాంబయ్య,వెంకటేశ్వర్లు మరియు ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు.

Related posts

స్వంత వర్గాన్ని వైసీపీపై రుద్దేందుకు గంటా ప్లాన్

Satyam NEWS

వార్నింగ్ లెటర్ :భోపాల్ ఎంపీ కి అనుమానాస్పద లేఖ

Satyam NEWS

ట్రాజెడీ: రోడ్డు ప్రమాదంలో ఎస్ఐ భార్య మృతి

Satyam NEWS

Leave a Comment