31.2 C
Hyderabad
May 2, 2024 23: 56 PM
Slider ముఖ్యంశాలు

ప్రతి ఉపాధ్యాయుడు ఎమ్మెల్సీ ఓటరుగా నమోదు చేసుకోవాలి

#teachers

మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల ఉపాధ్యాయులు ఉపాధ్యాయ MLC ఓటరు నమోదు కార్యక్రమంలో పాల్గొనాలని తెలంగాణ రాష్ట్ర కంట్రిబ్యూటరి పెన్షన్ స్కీం ఎంప్లాయిస్ యూనియన్ జోగులాంబ గద్వాల జిల్లా అధ్యక్షులు నాగరాజు, జిల్లా ఉపాధ్యక్షుడు పాల్వాయి లక్ష్మీనారాయణ పిలుపునిచ్చారు. గద్వాల్ ప్రాక్టీసింగ్ హైస్కూల్ లో జరుగుతున్న సోషల్  స్కూల్ కాంప్లెక్స్  సమావేశంలో టీచర్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓటర్ల నమోదు ఫారాలు పంపిణీ చేశారు. అలాగే దూర ప్రాంతంలో ఉన్న ఉపాధ్యాయుల కోసం ఆన్ లైన్ లో ఓటరు నమోదు కూడా చేస్తున్నామని తెలిపారు.

జిల్లా అధ్యక్షులు నాగరాజు మాట్లాడుతూ ఇప్పటికే సీపీయస్ రద్దుకై అలుపెరగని పోరాటం చేస్తూ సిపీయస్ యూనియన్ ఏర్పడిన 4 సంవత్సరాల్లో గ్రాట్యుటీ ,2022 లో 1లక్ష75వేల కుటుంబాలకు ఫ్యామిలీ పెన్షన్ సాధించి పెట్టిన ఘనత టి.యస్.సి.పి.యస్.ఈ. యూ అని తెలిపారు. రాబోయే ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో  సిపిఎస్ సంఘం అభ్యర్థి పోటీ చేస్తున్నాడని తెలిపారు. రాజస్థాన్, ఛత్తీస్ ఘడ్, జార్ఖండ్ ,పంజాబ్ రాష్ట్ర ప్రభుత్వాల మాదిరిగా CPS విధానం రద్దు చేసి 1980 పెన్షన్ రూల్ ప్రకారం పాత పెన్షన్ విధానం సత్వరమే అమలు పరచడానికి రాజకీయ నిర్ణయం తీసుకుని ఉద్యోగ,ఉపాధ్యాయులకు వృద్దాప్యంలో సామాజిక భద్రత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేయడం జరిగింది.

ప్రభుత్వం CPS ఉద్యోగులకు ప్రతి నెల చెల్లించే 80 కోట్లు మిగలడంతో ఈ డబ్బులను ప్రభుత్వం సంక్షేమ కార్యక్రమాలకు వాడుకోవచ్చు అని తెలిపారు. పాల్వాయి లక్ష్మీనారాయణ మాట్లాడుతూ 317 జి.ఓ ద్వారా నష్టపోయిన ఉపాధ్యాయులకు కంజాయింట్ జొన్స్ ఏర్పాటు ద్వారా సమస్యకు పరిష్కారం చూపే బాధ్యత మా యూనియన్ తీసుకుంటుంది. ఉపాధ్యాయుల ఆర్థిక సమస్యల సంక్షేమార్థం కో ఆపరేటివ్ సొసైటీ ఏర్పాటు చేయడం జరుగుతుంది.

ప్రతి ఉపాధ్యాయుడు ఎమ్మెల్సీ  ఓటరుగా నమోదు చేసుకుని, అడియాసలైన తమ ఆశలను తమ  ఓటుతో నెరవేర్చుకోవాలని, అందుకు తమ మాటను తన నోట బలంగా వినిపించ గల సత్తా ఉన్న TSCPSEU తరఫు అభ్యర్థిని గెలిపించి తమకు అన్ని వేళలా అందుబాటులో ఉండే, తమలో ఒకరైన వ్యక్తిని చట్టసభకు తప్పక పంపాలని కోరారు.

సమస్యల సాధనలో TSCPSEU తన శక్తి వంచన లేకుండా కృషి చేసి సాధించితీరుతామని,ఒక మార్పు కొరకై సీపీయస్ సంఘ అభ్యర్థి కు సంపూర్ణ మద్దతు తెలపాలన్నారు. ఈ కార్యక్రమంలో స్కూల్ కాంప్లెక్స్ హెడ్మాస్టర్ జహిరుద్దిన్, సోమ శేఖర్ రెడ్డి, సీపీయస్ యూనియన్ జిల్లా కోశాధికారి వన్నవాడ రమేష్,జిల్లా క్రమ శిక్షణ కమిటీ చైర్మన్ నరసింహ, నగేష్,నాగరాజు, ,గోవింద్,కృష్ణ కుమారి,రాజు,ఉష రాణి, రాముడు,సాయన్న,భాస్కర్, వివిధ మండల బాధ్యులు  తదతరులు పాల్గొన్నారు.

Related posts

9న పేదలకు భూ పంపిణి

Bhavani

జగన్ చేస్తున్న తప్పుల వల్లే చంద్రబాబుకు బ్రహ్మరథం

Satyam NEWS

Over-The-Counter Blood Pressure Is High Even With Medication What Makes Blood Pressure Lower

Bhavani

Leave a Comment