38.2 C
Hyderabad
May 2, 2024 21: 32 PM
Slider విజయనగరం

56 రోజుల పోరాటంతో సిద్ధించిన రాష్టం

ఉమ్మడి ఏపీ రాష్ట్ర అవతరణ అమరజీవి అయిన పొట్టి శ్రీరాములు ను స్మరించుంది…యావత్ ఏపీ రాష్ట్రం. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల సందర్భంగా పోలీసు బాస్ దీపికా… జాతీయ పతాకాన్ని ఎగురవేసారు.ఈ సందర్భంగా ఏ.ఆర్…విభాగం ఏఎస్ఐ గోవింద్… ఎస్పీ ..జెండా ఎగుర వేయడంలో శాఖా ఆదేశాలు పాటించారు. ఈ మేరకు విజయనగరం జిల్లా పోలీసు కార్యాలయంలో రాష్ట్ర అవతరణ దినోత్సవంను జిల్లా పోలీసుశాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ ఎం. దీపిక ముఖ్య అతిధిగా హాజరై, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పూలమాలలు వేసి, పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు. జిల్లా పోలీసు కార్యాలయ ప్రాంగణంలో జాతీయ పతాకాన్ని జిల్లా ఎస్పీ ఎం.దీపిక ఎగుర వేసారు.

ఈ సందర్భంగా
జిల్లా ఎస్పీ ఎం. దీపిక మాట్లాడుతూ – మద్రాసు రాష్ట్రంలో తెలుగు ప్రజలకు న్యాయం జరగడం లేదని, తెలుగు మాట్లాడే ప్రజలందరికీ ప్రత్యేక రాష్ట్రం కావాలని శ్రీ పొట్టి శ్రీరాములు గారు ఉద్యమించి, ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారన్నారు. 56 రోజులు నిరాటంకంగా అమరణ నిరాహార దీక్ష చేపట్టిన పొట్టి శ్రీరాములు గారు, ప్రత్యేక రాష్ట్ర స్థాపనకు తుది శ్వాస విడిచారన్నారు. పొట్టి శ్రీరాములు గారి మరణం తరువాత కేంద్ర ప్రభుత్వం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఆవశ్యకతను గుర్తించి, కర్నూల్ రాజధానిగా నవంబరు 1, 1953 ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రకటించడం జరిగిందన్నారు. అనంతరం, రాష్ట్రాల పునః వ్యవస్థీకరణ చట్టంతో హైదరాబాద్ కేంద్రంగా నవంబరు 1, 1956న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంగా అవతరించిందన్నారు.

తెలుగు రాష్ట్రం ఏర్పడుటకు అమరజీవి పొట్టి శ్రీరాములు చేసిన త్యాగాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించి, స్మరించుకోవలసిన అవసరం ఎంతైనా ఉందని ఉందన్నారు. పొట్టి శ్రీరాములు గాంధేయవాదిగా స్వాతంత్య్ర పోరాటంలో కూడా పాల్గొని, దేశానికి స్వాతంత్య్రం ఏర్పడేందుకు కూడా కృషి చేసారని జిల్లా ఎస్పీ ఎం. దీపిక అన్నారు. ఈ కార్యక్రమంలో ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, ఎస్సీ ,ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, డిపిఓ ఎఓ వెంకట రమణ, సిఐలు జి.రాంబాబు, జే. మురళి, ఆర్ ఐలు చిరంజీవి, పి.నాగేశ్వరరావు, మరియన్ రాజు, రమణమూర్తి, న్యాయ సలహాదారులు వై.పరశురాం, డిపిఓ సూపరింటెండెట్లు కామేశ్వరరావు, ప్రభాకరరావు, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొని, అమరజీవి పొట్టి శ్రీరాములు చిత్ర పటానికి పుష్పాలు సమర్పించి, ఘనంగా నివాళులు అర్పించారు.

Related posts

చీరాల బీచ్ లో సందడి చేసిన నందరమూరి బాలకృష్ణ

Satyam NEWS

రివర్స్ టెండరింగ్ వల్ల పెరుగుతున్న కరెంటు చార్జీలు

Bhavani

ఆవుల అక్ర‌మ ర‌వాణాకు పోలీసులు అడ్డుక‌ట్ట‌

Satyam NEWS

Leave a Comment