30.2 C
Hyderabad
April 27, 2025 19: 17 PM
Slider ఆదిలాబాద్

హ్యాపీ హ్యాపీ:నాగోబా రూపంగా నాగుపాము కనబడటంతో

adilabad tribal fest nagoba snake appears

మహాపూజతో మొదలైన ఆదిలాబాద్‌ జిల్లా ఇంద్రవెల్లి మండలంలోని కేస్లాపూర్‌ లో జరిగే ప్రతిష్ఠాత్మక నాగోబా జాతర లో నాగోబా రూపంగా భావించే నాగుపాము కనబడటం తో గిరిజనులు నాగోబానే ఆయూపంలో వచ్చాడని ఆనందం లో ఉన్నారు. ఈ సంవత్సరం కాలం లో మెస్రం వంశస్తులను వివాహం చేసుకున్న 69 మంది కొత్త కోడళ్లు తెల్లని వస్త్రాలు ధరించి వచ్చినిన్న ప్రత్యేక పూజల చేసిన అనంతరం నాగోబా దర్శనం చేసుకున్నారు.

ఇదే సమయంలో ఆలయానికి సమీపంలోనే ఉన్న విశ్రాంతి గృహం బండరాళ్లపై నాగుపాము కనిపించడంతో భక్తులు హర్షధ్వానాలు చేశారు. ప్రతి జాతర ముందూ కొత్త కోడళ్లను ఆలయానికి తీసుకుని వచ్చి ‘బేటింగ్’ అనే ప్రక్రియ నిర్వహించి, ఆపై వారికి నాగోబా దర్శనం కల్పించిన తరువాత జాతర మొదలవుడి.అదే సమయంలో నాగుపాము కూడా కనిపించడంతో ఈ సంవత్సరం దేవుడు తమను ఆశీర్వదించాడని మెస్రం వంశస్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు.

Related posts

శ్రీనివాస సేతు మూడవ దశ పనులు త్వరితగతిన పూర్తి

Satyam NEWS

సరిహద్దుల్లో యుద్ధ వాతావరణం

Satyam NEWS

మహానుభావులను గుర్తు చేసుకున్న సిక్కోలు వాసులు

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!