29.7 C
Hyderabad
May 4, 2024 04: 52 AM
Slider విజయనగరం

విద్యల నగరంలో పిల్లలతో ముష్ఠెత్తుకుంటున్న గర్భిణులు

#viajyanagaram

“కోటి విద్యలు కూటి కోసం…పూటే గడవని ముష్టి జీవితం..” అప్పుడెప్పుడో ఎన్టీఆర్ ,ఏఎన్నార్ నటించిన “మిస్సమ్మ”..చిత్రం లోని పాట అది. సరిగ్గా ఈ ఏండ్రాయిడ్ కాలంలో ఆ విధంగా నే కొందరు  పబ్బం గడుపుకుంటున్నారు. ఎల్లప్పుడూ నిఖార్సైన..నిక్కచ్చైన నిజాయితీ వార్తలను ఆన్ లైన్లలో అందిస్తున్న “సత్యం న్యూస్. నెట్” కి ఆ దృశ్యం చిక్కింది.

సరిగ్గా విజయనగరం ఆర్టీసీ కాంప్లెక్స్ వద్ద…ఆర్టీసీ బస్ స్టేషన్ అవుట్ గేట్ వద్ద ఓ నిండు గర్భిణి…చూస్తే అయ్యో పాపం అని జాలి దలుస్తారు…కాని  ఆ గర్భిణి…. తన కడుపు లో ఓ బిడ్డను మోస్తున్న…తన బిడ్డ గురించి… కాకుండా.. వేరే పసికందు ను అడ్డం పెట్టుకుని డబ్బులు(ముష్ఠి) అడగసాగింది.అయితే చైల్డ్ వెల్ఫేర్ సెల్(సీడబ్ల్యూసీ) ఇలాంటి తల్లులు…అలాగే పసికందులను ఎత్తుకుపోయి..తమ పిల్లలని చెప్పుకుంటున్నా డబ్బులు అడుక్కుంటున్న వారి గురించి ఎవ్వరైన ఫిర్యాదు చేసిన… తక్షణమే రంగంలో కి దిగి.. ఆ చిన్నారుల సంరక్షణ చూడటంతో పాటు… కన్నవారికి ఆశ్రయం కల్పిస్తూ ఉంటారు.

కానీ చంటిపిల్లలను అడ్డం పెట్టుకుని డబ్బులు దండుకునే వాళ్లపై కూడా ఓ కన్నేసి ఉంటున్న చిన్నారి అనే గర్భిణి… విజయనగరం అయ్యన్న పేట వద్ద సుందరయ్యకాలనీ ఉంటూ…పసిపిల్లలను అదీ మరో చంటిపిల్లలను అడ్డం పెట్టుకుని డబ్బులు సంపాదిస్తోందన్న సంగతి తెలుసుకున్న… సీడబ్ల్యూసీ  అందిన ఫిర్యాదు మేరకు.. వాళ్ళ ను చైల్డ్ హోమ్ కు తరలించారు.

ఎం.భరత్ కుమార్, సత్యంన్యూస్.నెట్, విజయనగరం

Related posts

భజరంగ్ దళ్ కార్యకర్తలపై దౌర్జాన్యాన్ని ఖండించిన విహెచ్ పి

Satyam NEWS

సిరిసిల్లా జిల్లాలో మరో ముగ్గురికి కరోనా పాజిటివ్‌

Satyam NEWS

తెలంగాణలో ఒక్క రోజులో తాగేసింది ఎంతో తెలుసా?

Satyam NEWS

Leave a Comment