Slider మహబూబ్ నగర్

వనపర్తి పట్టణంలో భూ మాఫియాను అరికట్టాలి

#landmafia

వనపర్తి పట్టణంలో భూ మాఫియాను అరికట్టాలని అఖిలపక్ష ఐక్యవేదిక అధ్యక్షుడు సతీష్ యాదవ్ అన్నారు. వనపర్తిలో గోపాల్పేట రోడ్డులోని డిగ్రీ కాలేజీ దగ్గర రాఘవేంద్ర కాలనీ సి బ్లాక్ వెంచర్ లో గతంలో లేఅవుటు చేసి ప్లాట్లు అమ్మిన్నారని ఆయన తెలిపారు. కానీ కొన్ని రోజుల తర్వాత దుర్బుద్ధి పుట్టిన వెంచర్ ఓనర్లు 30 ఫీట్ల రోడ్డును ప్లాట్లుగా చేసి, బై నెంబర్లుగా ప్లాట్లు వేసి కొందరికి అమ్మడం జరిగింది. గతంలో పక్క ప్లాట్లు వారికి రోడ్డు చూపించడం జరిగిందని తెలిపారు. గత ప్లాను, ఇప్పుడు మార్చిన దొంగ ప్లాను చూసి రిజిస్టర్ గారికి పూర్తి వివరాలు అందజేసి దొంగ ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపాలని డిమాండ్ చేశారు. వనపర్తిలో రెచ్చిపోతున్న భూమాఫియా, రియల్ మాఫియా, మట్టి మాఫియాలను అరికట్టాలని, చాలా వెంచర్లను ఇష్టానుసారంగా ప్రభుత్వ భూమి కూడా ఆక్రమించి వేస్తున్నారని, దానికి కొందరు చోటా, మోటా నాయకులు అండగా ఉంటున్నారని, అలాగే కొందరు రెవెన్యూ ఆఫీసర్ల అండ ఉందని  వారిని గుర్తించి శిక్షించాలని కోరారు. గతంలో పలు వెంచర్లపై ఇచ్చిన కంప్లైంట్ ను పరిగణలోకి తీసుకోకుంటే లోకాయుక్తకు, హైకోర్టుకు పిర్యాదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షుడు సతీష్ యాదవ్ తో పాటు, బొడ్డుపల్లి సతీష్ కుమార్, జానంపేట రాములు, కానిస్టేబుల్ సహదేవుడు, ప్రసాద్, మురారి, రమేష్  పాల్గొన్నారు.

పోలిశెట్టి బాలకృష్ణ, సీనియర్ విలేకరి, సత్యం న్యూస్ నెట్

Related posts

ప్రమోషన్:వనపర్తి జిల్లాకలెక్టర్ గా యాస్మిన్ బాషా

Satyam NEWS

శిరోముండనం కేసులో ఎస్ ఐపై సస్పెన్షన్ వేటు

Satyam NEWS

మనోవేదనకు గురి అవుతున్న చీఫ్ సెక్రటరీ నీలం సాహ్ని

Satyam NEWS

Leave a Comment