28.7 C
Hyderabad
May 6, 2024 10: 59 AM
Slider సినిమా

ఆదిపురుష్‌.. ఒక్క టికెట్‌ రూ.2200

#Adipurush

థియేటర్లలో ఆదిపురుష్‌ సందడి చేస్తున్నది. ఆదిపురుషుడి అవతారంలో ప్రభాస్‌ను చూసేందుకు ఉవ్విళ్లూరుతున్నారు. ఇప్పటి నుంచే అటు ర్యాలీలు, ఇటు భారీ కటౌట్లు ఏర్పాట్లు చేస్తూ నానా హంగామా చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో ఆదిపురుష్‌ హ్యాష్‌ ట్యాగ్‌ ట్రెండింగ్‌లో ఉంది. ఫ్యాన్స్‌. టికెట్‌ రేటు ఎంతున్నా సరే తగ్గేదే లేదంటున్నారు. ఈ క్రమంలో అనేక చోట్ల థియేటర్లు హౌస్‌ఫుల్‌ అయిపోయాయి. దేశ రాజధాని ఢిల్లీలో కూడా ఇదే పరిస్థితి! అయితే కొన్ని చోట్ల టికెట్ల రేట్లు చూస్తుంటే కళ్లు బైర్లు కమ్ముతున్నాయట.

ఢిల్లీ ఆంబియన్స్‌ మాల్‌లోని పీవీఆర్‌ డైరెక్టర్స్‌ కట్‌ థియేటర్‌లో ఆదిపురుష్‌ టికెట్‌ ధర ఎంతనుకుంటున్నారు? అక్షరాలా 2,200 రూపాయలు. ఇదేదో త్రీడీ వర్షన్‌కు అనుకునేరు. కేవలం 2 డీ ఫార్మాట్‌కు మాత్రమే! ఢిల్లీలోని పీవీఆర్‌: వేగాస్‌ లగ్జ్‌ థియేటర్‌లో కూడా ఒక్క టికెట్‌ ధర రెండు వేల రూపాయలుగా ఉంది.

ఇంత ధర పలుకుతున్నా సరే ఫ్యాన్స్‌ ఎగబడి టికెట్స్‌ కొనడంతో అనేక చోట్ల నిమిషాల్లోనే హౌస్‌ఫుల్‌ అవుతుండటం విశేషం.హైదరాబాద్‌లో త్రీడీ వర్షన్‌ టికెట్‌ ధర విషయానికి వస్తే కొన్ని చోట్ల రూ.325 నుంచి మొదలవుతుండగా మరికొన్ని చోట్ల రూ.400గా ఉంది. ఆదిపురుష్‌ సినిమా విషయానికి వస్తే.. ప్రభాస్‌ రాఘవుడిగా, కృతీ సనన్‌ జానకిగా నటించారు. సైఫ్‌ అలీ ఖాన్‌ లంకేశ్వరుడిగా సన్నీ సింగ్‌ లక్ష్మణుడిగా కనిపించనున్నారు.

Related posts

అమరావతి పిటీషన్ల పై మళ్లీ వాయిదా

Bhavani

అమెరికాలో భారత కాన్సులేట్ కు నిప్పంటించిన ఖలిస్తానీలు

Satyam NEWS

భూ సేకరణలో కోర్టు ధిక్కరణపై ఇద్దరు ఐఏఎస్ లకు జైలు శిక్ష

Satyam NEWS

Leave a Comment