39.2 C
Hyderabad
April 28, 2024 11: 22 AM
Slider ప్రత్యేకం

అమరావతి పిటీషన్ల పై మళ్లీ వాయిదా

భారత ప్రధాన న్యాయమూర్తిగా యు యు లలిత్ ఉండగానే అమరావతి పిటీషన్లపై అప్పీలు సుప్రీంకోర్టులో రావాలని కోరుకున్న రాష్ట్ర ప్రభుత్వానికి మరో మారు నిరాశ ఎదురైంది. అమరావతిపై దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టులో మరోమారు విచారణ వాయిదా పడింది. ఈ నెల 14న అమరావతి పిటిషన్లపై విచారణ చేపట్టనున్నట్లు శుక్రవారం సుప్రీంకోర్టు తెలిపింది. ఈ పిటీషన్లు చీఫ్ జస్టిస్ యు యు లలిత్ ఉండగానే చేపట్టాలని ప్రభుత్వం కోరుకుని ఆ మేరకు ప్రయత్నాలు చేసింది. సోమవారంతో లలిత్ పదవి కాలం ముగుస్తుంది. అయితే ప్రభుత్వ న్యాయవాదులు చేసిన వినతిని పట్టించుకోకుండా 14వ తేదీకి కేసును పోస్టు చేశారు. ఏపీ రాజధాని అమరావతేనని, దానిని నిర్ణీత కాల వ్యవధిలోగా భివృద్ధి చేయాలంటూ ఏపీ హైకోర్టు రాష్ట్ర ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ తీర్పును సవాల్ చేస్తూ ఏపీ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్ లో తమనూ ఇంప్లీడ్ చేసుకోవాలంటూ అమరావతి రైతులు మరో పిటిషన్ దాఖలు చేశారు. కొందరు వ్యక్తులు కూడా ఈ వ్యవహారంపై పిటిషన్లు దాఖలు చేశారు.

ఈ అన్ని పిటిషన్లను కలిపి ఓకేసారి విచారణ చేపట్టనున్నట్లు గతంలోనే సుప్రీంకోర్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. వాస్తవానికి ఈ నెల 1న అమరావతి పిటిషన్లపై సుప్రీంకోర్టులో విచారణ జరగాల్సి ఉంది. అయితే రాజధానికి బంధించిన వ్యవహారంలో యు యు లలిత్ న్యాయవాదిగా ఉన్నప్పుడు వై ఎస్ జగన్ కోరితే లిఖిత పూర్వక అభిప్రాయాన్ని వ్యక్తం చేశారనే విషయాన్ని అమరావతి రైతుల తరపు న్యాయవాదులు గుర్తు చేశారు. దాంతో సీజేఐ జస్టిస్ లలిత్… నాట్ బిఫోర్ మీ అంటూ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఈ పిటిషన్లను మరో బెంచ్ కు బదిలీ చేయాలని, ఈ నెల 4న వాటిపై విచారణ చేపట్టాలని కూడా జస్టిస్ లలిత్ ఆదేశాలు జారీ చేశారు. అయితే ఈ పిటిషన్లు లిస్ట్ అయిన బెంచ్ వద్దకు వెళ్లిన మరావతి రైతుల తరఫు న్యాయవాది వికాస్ సింగ్… బెంచ్ కార్యకలాపాలు ముగుస్తున్నా తమ పిటిషన్ విచారణకు రాని విషయాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. దీంతో అమరావతి పిటిషన్లపై విచారణను ఈ నెల 14న చేపట్టనున్నట్లు కోర్టు తెలిపింది.

Related posts

513.70 మీ.కి చేరిన హుస్సేన్‌సాగర్‌ నీటిమట్టం

Satyam NEWS

బ్రుటల్:పశువులపై ఇద్దరి అత్యాచారం అరెస్ట్

Satyam NEWS

ఎస్సీ కమ్యూనిటీ హాల్స్ నిర్మాణానికి 2.38 కోట్ల నిధులు మంజూరు

Satyam NEWS

Leave a Comment