28.7 C
Hyderabad
May 5, 2024 10: 03 AM
Slider ముఖ్యంశాలు

ఆర్టీసీ బస్సు” ఫ్రీ” అంటే ఇలా ఉంటుంది

#RTC Bus

కర్ణాటకలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కూడా ఒక కారణం అయింది. గత ఆదివారం ముఖ్యమంత్రి సిద్ధరామయ్య ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం ఫ్రీ బస్స్ సౌకర్యాన్ని వినియోగించుకునేందుకు కర్ణాటకలో మహిళలు పోటీ పడుతున్నారు.

పెద్ద సంఖ్యలో కేఎస్ఆర్టీసీ బస్సుల్లో మహిళలు పుణ్య క్షేత్రాలకు తరలివెళ్తున్నారు. ముఖ్యంగా ధర్మస్థల, కుక్కె సుబ్రమణ్యం, మురుడేథ్వర్, హంపి వంటి పుణ్య క్షేత్రాలకు, పర్యాటక ప్రాంతాలకు మహిళలు తరలివెళ్తున్నారు. దీంతో బస్సులన్నీ ఫుల్లుగా దర్శనమిస్తున్నాయి.

రాష్ట్రంలోని పలు మార్గాల్లో బస్సులన్నీ కిటకిటలాడుతున్నాయి. అడుగు మోపే స్థలం లేకుండా బస్సులు కిక్కిరిసిపోతున్నాయి. బస్సు పూర్తిగా నిండిపోవడంతో కాలు కదిపే సందు కూడా లేదు. కర్ణాటక ప్రభుత్వం మహిళలకు ఫ్రీ బస్ సౌకర్యాన్ని కొన్ని బస్సుల్లోనే కల్పించింది.

కేవలం ఆర్డీనరీ, ఎక్స్ ప్రెస్ బస్సల్లోనే ఈ ఫ్రీ సౌకర్యం ఉంది. ఐరావత, రాజహంస లాంటి ఏసీ, లగ్జరీ బస్సుల్లో ఈ సౌకర్యం లేదు. మరోవైపు బస్సుల్లో సగం సీట్లను పురుషులకు రిజర్వ్ చేసింది. ఆర్టీసీ ఆదాయం దెబ్బతినకుండా ఈ చర్యలు తీసుకుంది…

Related posts

కేసీఆర్ కు షర్మిల భయం పట్టుకుంది

Satyam NEWS

చెయ్యేరు బాధితులను ఆదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలం……

Bhavani

సోలిపేట రామలింగారెడ్డి భౌతిక కాయానికి ప్రముఖుల నివాళి

Satyam NEWS

Leave a Comment