తమకు ఉద్యోగాల్లో రిజర్వేషన్ లు కల్పించాలని కోరుతూ కొన్ని ప్రాతాల కన్నడ ప్రజలు ఇచ్చిన బంద్ఫ హింసాత్మకం గా మారింది.మంగుళూరు లో ని ఫరంగిపేటలో తిరుపతి-మంగళూరు బస్సు ఫై ఆందోళకారులు రాళ్ళు విసిరారు.బస్సు అద్దాలు పగిలిపోగా కొందరు ప్రయాణికులు గాయపడ్డారు. ప్రైవేట్ మరియు ప్రభుత్వ రంగ సంస్థలలో కన్నడిగులకు కొంత శాతం ఉద్యోగాలను సిఫారసు చేసిన
సరోజిని మహిషి నివేదికను అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కన్నడ అనుకూల గ్రూపులు నేడు కర్ణాటక బంద్ కు పిలుపునిచ్చాయి.ఈ నేపథ్యం లో జరుగు తున్న బంద్ లో కొందరు రాళ్లు రువ్వడం చేస్తుండగా పోలీస్ లు రంగ ప్రవేశం చేసి వారిని అడ్డుకుంటున్నారు.గాయ పడిన వారిని ఆసుపత్రికి చికిత్సకు పంపినట్లు పోలీస్ లు తెలిపారు.