మధ్యప్రదేశ్‌లోని భోపాల్ రైల్వే స్టేషన్ వద్ద ఈరోజు ఉదయం పాదాచారులు నడిచే వంతెన కొంత భాగం కూలిపోయింది. ఈ ఘటనలో ఆరుగురు త్రీవంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆస్పత్రికి తరలించి వైద్య సేవలు అందిస్తున్నారు.రద్దీ ఎక్కువగా ఉండటం తో పాటు వంతెన పురాతనమైనందున ఈ ప్రమాదం జరిగి ఉండ వచ్చని తెలుస్తుంది.ఘటన స్థలానికి చేరుకున్న అధికారులు వంతెన కూలిపోవడానికి గల కారణాలను తెలుసుకుంటున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సి వుంది.
previous post
next post