మరో యువతీ తో అక్రమ సంబంధం పెట్టుకోవడాన్ని ప్రశ్నించినందుకు గాను భార్యను వీధుల్లోకి లాగి మరి జుట్టు పట్టుకుని చితక బాదాడో భర్త.మధ్యప్రదేశ్ లో గాంధ్వానీ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ నరేంద్ర సూర్యవంశీ తన భార్యపై ధార్ గ్రామం లో దాడి చేసిన సంఘటన చూపరులను విస్తుగొల్పింది.
ఒక పోలీస్ ఆఫీసర్ అయ్యి ఉండి మరో మహిళతో అక్రమ సంబంధాన్ని వ్యతిరేకించినందుకు భార్యను అంతలా కొట్టాలా అనిప్రజలు ప్రశ్నిస్తున్నారు.వైరల్ అయినా ఈ దాడికి సంబదించిన వీడియోలను చూసి స్పందించిన అక్కడి ఎస్‌డిఓపి మనవర్ మాట్లాడుతూ “నరేంద్రను జిల్లా కేంద్రానికి బదిలీ చేసి విచారణ జరుపుతున్నామని తెలిపారు.