29.7 C
Hyderabad
May 1, 2024 08: 06 AM
Slider ముఖ్యంశాలు

విద్వేషపూరిత ప్రసంగంతో కోర్టు మెట్టెక్కిన ఓవైసీ

akbaruddin-owaisi

విద్వేషపూరిత ప్రసంగం చేసిన కేసులో ఎంఐఎం పక్ష నేత, ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ నేడు నిర్మల్ కోర్టుకు హాజరయ్యారు. 2012 లో నిర్మల్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియంలో జరిగిన బహిరంగ సభలో హిందూ దేవతలను కించపరుస్తూ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీ ప్రసంగించిన విషయం తెలిసిందే.

మత విద్వేషాలను రెచ్చ గొడుతూ ఆయన చేసిన ప్రసంగంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దాంతో దీనిపై నిర్మల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి విచారణలో పాల్గొనేందుకు ఇన్ చార్జి జూనియర్ అడిషనల్ జుడిషియల్ ఫస్ట్ క్లాస్ మెజిస్ట్రేట్ రామలింగం ఎదుట అక్బరుద్దీన్ ఓవైసీ హాజరైనారు. ఇదే కేసులో నిర్మల్ కు చెందిన మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ అజీంబీన్ యాహియా సైతం న్యాయమూర్తి ఎదుట హాజరు అయ్యారు.

తన అనారోగ్య కారణాల రీత్యా కేసును హైదరాబాదులోని నాంపల్లి కోర్టుకు బదిలీ చేయాలని అక్బరుద్దీన్ ఓవైసీ న్యాయమూర్తిని అభ్యర్ధించారు. దాంతో కేసును నాంపల్లి కోర్టుకు బదిలీ చేస్తూ న్యాయమూర్తి నిర్ణయం తీసుకున్నారు. తదుపరి విచారణకు నాంపల్లి కోర్టులో ఆయన హాజరు కావాల్సి ఉంటుంది.

Related posts

వచ్చే ఎన్నికలు తేజస్వీ నాయకత్వంలోనే…

Satyam NEWS

సీఎం జగన్ వెకిలినవ్వు.. నిరుద్యోగుల చెవిలో పువ్వు !

Satyam NEWS

ఒకరికి తెలియకుండా మరొకరు.. మొత్తం ఆరుగురు

Satyam NEWS

2 comments

Sistla nageswararao December 10, 2019 at 3:17 PM

Thought provoking

Reply
Satyam NEWS December 26, 2019 at 9:21 PM

Thank You

Reply

Leave a Comment