38.2 C
Hyderabad
May 5, 2024 19: 55 PM
Slider రంగారెడ్డి

సీబీఐటి ఆధ్వర్యంలో వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞాన ప్రదర్శన

#cbit

ఎసిఐసి – సీబీఐటి ఆధ్వర్యం లో నేడు వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానాల ప్రదర్శన నిర్వహించారు. సిబిఐటి కళాశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో రైతులు, వ్యవసాయ ఔత్సాహికులు పాల్గొన్నారు. వ్యవసాయం చేసే రైతులను అగ్రగామిగా మార్చడానికి ఈ వ్యవసాయ మేళా మరియు ప్రదర్శన ఎంతో ఉపయోగపడుతుందని సీబీఐటి విభాగాధిపతి ఆన్నే విజయ తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన ఆవిక్షరణలు ప్రదర్శించారు.

నూతన సాంకేతికత, ఆధునిక వ్యవసాయాన్ని అవలంబించాలనే ఆసక్తి ఉన్న రైతులు అధిక సంఖ్యలో ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ నుండి ఆరోగ్య సాంకేతికత, పర్యావరణానికి సుస్థిరత, సాంకేతికత మొదలైనవాటి సుమారుగా 40 ఇన్నోవేషన్ వినూత్న ప్రదర్శనలు ఇచ్చారు అని కళాశాల ప్రిన్సిపాల్ ప్రొఫెసర్ పి రవీందర్ రెడ్డి తెలిపారు.

కొబ్బరిబొండాల క్రషింగ్ యంత్రం, వెల్లుల్లి, ఉల్లిపాయలు మరియు వేరుశెనగ స్కిన్ రిమూవర్ మెషిన్, వాయువు ద్వారా కరెంటు ఉత్పత్తి  యంత్రం, సోలార్ రిక్షా , వివిధ ఆధునాతన వ్యవసాయ పనిముట్టులు, పల్లె సృజన మరియు క్రియేటివ్ మైండ్స్ సహకారం తో ఈ కార్యక్రమం విజయమంతమైందని కళాశాల పి ఆర్ ఓ డాక్టర్ జి ఎన్ ఆర్ ప్రసాద్ తెలిపారు.

Related posts

అందాల రేఖ 68వ పుట్టిన రోజు నేడు

Satyam NEWS

ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లకు హైకోర్టు బ్రేక్

Sub Editor

కార్మికులపై దాడిని తిప్పికొడదాం

Sub Editor

Leave a Comment