32.2 C
Hyderabad
May 13, 2024 20: 18 PM
Slider సినిమా

అందాల రేఖ 68వ పుట్టిన రోజు నేడు

#rekha

రేఖ అలనాటి బాలీవుడ్ నటి… ఆమె అందానికి వయస్సుతో పని లేదు. 67 ఏళ్ల వయసులో కూడా ఎవర్ గ్రీన్ బ్యూటీ అని పిలుచుకునేంత అందంగా ఉంది. సినిమాల నుండి రాజ్యసభ వరకు ప్రయాణించిన రేఖ ఎప్పుడూ ఉల్లాసంగా ఉత్సాహంగానే కనిపిస్తుంది. నేటికీ బాలీవుడ్ యువ నటీమణులు ఆమె అందం ముందు పాలిపోతారు. తన జీవితంలో ఒడిదుడుకులు అన్నీ చవిచూసిన రేఖ వ్యక్తిగత జీవితం ఏదైతేనేం, కెరీర్ ఎప్పుడూ బ్రిలియంట్‌గానే ఉంది. రేఖ వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడుకోవాలంటే వినిపించే మొదట పేరు అమితాబ్ బచ్చన్.

వీరిద్దరి వ్యవహారంపై పెద్ద ఎత్తున అప్పటిలో చర్చ జరిగింది. అయితే రేఖ జీవితంలోకి అమితాబ్ రాలేదు. అయినా రేఖ అమితాబ్ హిట్ పెయిర్ గానే నిలిచిపోయారు. నేడు రేఖ 68వ పుట్టినరోజు. తొలిసారిగా సూపర్ స్టార్ జితేంద్రతో రేఖ హిట్ పెయిర్ గా పేరు మారుమోగింది.

వారిద్దరూ పెళ్లి చేసుకుంటారనేంత స్థాయిలో కలిసి తిరిగారు. అయితే, జితేంద్ర వివాహం శోభా కపూర్‌తో జరిగింది. దాంతో వారిద్దరి ప్రేమ కథ మారిపోయింది. రేఖ అమితాబ్ జంట తెరపై వెలుగు వెలిగింది. రేఖ వ్యక్తిగత జీవితం కూడా అమితాబ్ తో ముడిపడి ఉన్నదనే పుకార్లు వ్యాపించాయి. తెరపై వీరిద్దరి రొమాన్స్ ప్రేక్షకులకు బాగా నచ్చింది. ఈ సాన్నిహిత్యం కేవలం సినిమాలకే పరిమితం కాకుండా నిజ జీవితంలోనూ ఉండేది.

హిట్ పెయిర్ అమితాబ్ రేఖ

రేఖకు అమితాబ్‌ అంటే ఎంత పిచ్చి ఉందో, అమితాబ్ కు కూడా రేఖపై అంతే ప్రేమ ఉండేది. కానీ చివరికి, అప్పటికే వివాహం మరియు కుటుంబం ఉన్న అమితాబ్ తన కుటుంబాన్ని రక్షించడమే సరైనదని భావించి రేఖకు దూరం అయ్యాడు. దీని తర్వాత రేఖ పేరు నటుడు వినోద్ మెహ్రాతో ముడిపడ్డది. వీరిద్దరూ రహస్యంగా పెళ్లి చేసుకున్నట్లు చెప్పుకునేవారు. వివాహానంతరం, వినోద్ మెహ్రాతో కలిసి రేఖ తన అత్తమామల ఇంటికి చేరుకున్నప్పుడు, వినోద్ తల్లి ఆమెతో అసభ్యంగా ప్రవర్తించిందట.

ఆ తర్వాత రేఖను ఇంటి నుండి బయటకు నెట్టివేసిందట. దాంతో ఆమె వినోద్ మెహ్రాతో తన సంబంధాలన్నింటినీ తెంచేసుకుంది. 90వ దశకంలో, రేఖ అక్షయ్ కుమార్‌తో ఖిలాడీ కా ఖిలాడీ అనే సినిమా చేసింది. ఈ సినిమాలో ఇద్దరూ చాలా బోల్డ్ సీన్స్ లో నటించారు. వీరిద్దరినీ తెరపై చూసి రేఖ, అక్షయ్‌ల మధ్య అనుబంధం పెరిగిపోయిందని మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. తనకంటే 13 ఏళ్లు చిన్న వాడైన అక్షయ్ తో తేఖ ప్రేమాయణం సాగిస్తోందని సినీ పరిశ్రమలో చర్చలు జరిగాయి.

అయితే ఈ విషయాన్ని వీరిద్దరూ ఎప్పుడూ మీడియాలో వెల్లడించలేదు. రేఖ, నటుడు సంజయ్ దత్‌ల ఎఫైర్ గురించి కూడా చాలా వార్తలు వచ్చాయి. జమీన్ ఆస్మాన్ సినిమా షూటింగ్ సమయంలో వీరిద్దరి మధ్య ప్రేమ చిగురించిందని అనేవారు. అయితే, తర్వాత సంజయ్ దత్ కూడా ఈ సంబంధంపై క్లారిటీ ఇచ్చాడు. ఇలా రేఖ జీవితం గాసిప్ లతోనే సాగింది. ఏది ఏమైనా గ్లామర్ డాల్ అంటే ఇప్పటికే రేఖ నే చెప్పుకోవాల్సి ఉంటుంది.

Related posts

నాగర్ కర్నూల్ జిల్లా సాహిత్యంపై నారాయణకు పిహెచ్ డి

Satyam NEWS

కరోనా కొత్త వేరియంట్ ప్రమాదకరమా?

Satyam NEWS

మైనర్ బాలిక సోనూ కౌర్ ను హత్య చేసిన దుండగులను శిక్షించాలి

Satyam NEWS

Leave a Comment