29.7 C
Hyderabad
April 29, 2024 08: 30 AM
Slider తెలంగాణ

ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్లకు హైకోర్టు బ్రేక్

inter admission

02ఇంటర్ ఆన్‌లైన్ అడ్మిషన్ల ప్రక్రియపై ఈ నెల 10 వరకు హైకోర్టు స్టే విధించింది. ఆన్‌లైన్ ద్వారా ఇంటర్ ప్రవేశాల ప్రక్రియను సవాల్ చేస్తూ దాఖలైన వ్యాజ్యంపై సోమవారం విచారణ జరిపిన ధర్మాసనం… ఈ మేరకు ఆదేశించింది.

ఆన్‌లైన్ ద్వారా ప్రవేశాలు జరిపితే విద్యార్థుల భవిష్యత్తుపై ప్రభావం పడుతుందని పిటిషనర్ తరఫు న్యాయవాది వాదనలు వినిపించారు. అడ్మిషన్ల ప్రక్రియలో నిబంధనలు పాటించట్లేదని ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు.

ఏ నిబంధనల ప్రకారం అడ్మిషన్లు ఆన్‌లైన్ చేపడుతున్నారని రాష్ట్ర ప్రభుత్వాన్ని ధర్మాసనం ప్రశ్నించింది. దీనికి సంబంధించి పూర్తి వివరాలతో అఫిడవిట్ దాఖలు చేసేందుకు ప్రభుత్వ తరఫు న్యాయవాది సమయం కోరారు.

ఈ క్రమంలో తదుపరి విచారణను ఈ నెల 10వ తేదీకి వాయిదా వేస్తూ… ప్రభుత్వాన్ని అఫిడవిట్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది

Related posts

టిఆర్ఎస్ తాలూకా యూత్ అధ్యక్షుడిగా అమర్ నాథ్

Satyam NEWS

రాష్ట్ర ప్రభుత్వం కాజేసిన పంచాయితీ నిధులు తిరిగి ఇవ్వాలి

Satyam NEWS

నేషనల్ మహాత్మా గాంధీ శాంతి సేవ రత్న అవార్డ్ అందుకున్న పుష్ప

Satyam NEWS

Leave a Comment