33.2 C
Hyderabad
May 3, 2024 23: 44 PM
Slider మహబూబ్ నగర్

కూలి రైతుల కష్టం ఎన్నటికీ మరువలేనిది:మాజీ మంత్రి జూపల్లి

#jupally

ప్రజా సమస్యలపై స్పందించడం నాయకుల ప్రధమ లక్షణం. అదే కోవలో మాజీ మంత్రి జూపల్లి కృష్ణారావు జీవనోపాధి కోసం సీతాఫలాలను సేకరించి రోడ్డుపై అమ్మేవారిని పలుకరించి వారి సమస్యలను తెలుసుకున్నారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి-యాపట్ల మార్గ మధ్యంలో తమ జీవనోపాధి కోసం అడవిలో సీతాఫలాలను సేకరించి కొందరు గిరిజనులు రోడ్డుపై కూర్చుని అమ్ముకుంటూ ఉంటారు.

అటుగా వెళుతున్న మాజీ మంత్రి జూపల్లి వారిని పలకరించి మార్కెట్ లో ఉన్న సీతాఫలాల డిమాండ్ గురించి, వాటిని సేకరించడానికి కూలీలకు ఎదురయ్యే సమస్యలను గురించిని అడిగి తెలుసుకున్నారు. సీతాఫలాలు ఆరోగ్యానికి చాలా ఉపయోగకరమని ఆయన ఈ సందర్భంగా తెలిపారు. గిరిజనులు ఎన్నో రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఇలా వ్యాపారం చేసుకుంటున్నారని ఆయన అన్నారు. ఈ సందర్భంగా అక్కడి మహిళలను ఆయన అభినందించారు. అనంతరం వారి సంతృప్తి కొరకు వారి నుంచి సీతాఫలాలు కొనుగోలు చేశారు.

Related posts

మాజీ ఎమ్మెల్యే యరపతినేని ఇళ్ల లో సీబీఐ తనిఖీలు

Satyam NEWS

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

మెడిసిన్ సీటు సాధించిన తేజస్వినికి సన్మానం

Satyam NEWS

Leave a Comment