30.7 C
Hyderabad
May 5, 2024 06: 17 AM
Slider విజయనగరం

జనవరి 3,4 తేదీల్లో ఏఐటీయూసీ మహాసభలు

#aituc

కార్మికులకు రక్షణ కోసం పోరాడుతుందని ఏఐటీయూసీ విజయనగరం జిల్లా కార్యదర్శి బుగత అశోక్ అన్నారు. విజయనగరం ఏఐటియుసి11వ జిల్లా మహాసభలు మహాసభల సందర్భంగా జిల్లా కేంద్రంలో మహారాజా ఆసుపత్రి వద్ద యూనియన్ ప్రధాన కార్యదర్శి టి.జీవన్ తో కలిసి ఏఐటీయూసీ జెండా ఆవిష్కరించారు. అనంతరం వర్కర్స్ తో కలిసి ఏఐటియుసి జిల్లా మహాసభలు కరపత్రాలు విడుదల చేసి 2022 జనవరి 3,4 తేదీలలో జరుగు జిల్లా మహాసభలు జయప్రదం చేయాలని ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి బుగత అశోక్ పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ వందేళ్ళ చరిత్ర కలిగిన భారత కార్మిక ఉద్యమ రథసారథి ఏఐటియుసి అని అన్నారు. ఈ సందర్భంగా జిల్లా మహాసభలు విజయనగరంలో వచ్చే ఏడాది జనవరి 3,4 తేదీల్లో జరుగుతున్నాయన్నారు.ఉద్యమ అభిమానులు పెద్దఎత్తున పాల్గొంటున్న ఈ మహాసభలు ఎంతో ప్రాధాన్యత సంతరించుకున్నదన్నారు. భారతదేశంలో స్వాతంత్ర్యo రాకముందు మొట్టమొదటి సారిగా కార్మిక హక్కుల కోసం అవతరించిన కార్మిక సంస్థ ఏఐటీయూసీ అన్నారు.

భారత స్వతంత్ర పోరాటంలో కోట్లాది మంది కార్మికులకు నాయకత్వం వహించి దేశానికి “సంపూర్ణ స్వాతంత్ర్యం” కావాలని మొట్టమొదటగా డిమాండ్ చేస్తూ స్వతంత్ర సమరంలో అగ్రభాగాన నిలిచిన ఏకైక జాతీయ కార్మిక సంస్థ ఆల్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్ (ఏఐటియుసి) అని అన్నారు.1920లో అక్టోబర్ 31న తేదీన దేశ వాణిజ్య రాజధాని ముంబైలో పురుడు పోసుకున్నప్పటి నుండి కార్మిక వర్గం కోసం అలుపెరగని పోరాటాలు నడిపిందన్నారు.

ప్రముఖ జాతీయోద్యమ నాయకులు లోకమాన్య బాలగంగాధర్ తిలక్, లాలాలజపతిరాయ్, పండిట్ జవహర్లాల్ నెహ్రూ, నేతాజీ సుభాష్ చంద్రబోస్ లాంటి మహోన్నత మైన వ్యక్తులు వ్యవస్థాపక అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులుగా పని చేశారు. సంఘం పెట్టుకునే హక్కు, ఇండియన్ ట్రేడ్ యూనియన్ యాక్ట్ (1926) మొదలుకొని ఇవాళ కార్మికవర్గం అనుభవిస్తున్నా 44 కార్మిక చట్టాలు రూపిశిల్పి ఏఐటీయూసీ అని అన్నారు.

ఉరికొయ్యల చెరసాలలను లెక్కచేయక బ్రిటిష్ వారితో పోరాడి, ఎన్నో బలిదానాలు చేసి, సంపాదించిన చట్టాలను స్వాతంత్రోద్యమంలో ఏమాత్రం సంబంధం లేని ఆమాటకొస్తే వారితో రహశ్య ఒప్పందం చేసుకున్న మితవాద-మతవాద భావజాలానికి వారసురాలైన ప్రధాని మోడీ ప్రభుత్వం కార్మిక చట్టాలను నాలుగు కొత్త వేజ్ కోడ్ లతో కార్మికులకు తీవ్రమైన, నష్టాన్ని కలుగజేస్తున్నదని విమర్శించారు.

కొత్త కార్మిక కోడ్ ల ద్వారా ఇప్పటికే 29 చట్టాలు రద్దయ్యాయని,సంపద సృష్టి కర్తలైన కార్మికులు, ఉద్యోగులు  హక్కుల పరిరక్షణకు మరింత తీవ్రస్థాయిలో పోరాటాలు నిర్వహించిన పరిస్థితుల్లో ఏఐటీయూసీ జిల్లా 11వ మహాసభ లను మన విజయనగరంలో  జరుగుతున్నాయన్నారు.

Related posts

విద్యా కానుక కాదు..విద్యార్థులకు దగా కానుక….

Satyam NEWS

పరీక్షల భయంతో చిన్నారి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

విద్యార్థిని మనీషా ఎలా చనిపోయింది..?

Satyam NEWS

Leave a Comment