35.2 C
Hyderabad
April 27, 2024 14: 04 PM
Slider ముఖ్యంశాలు

విద్యా కానుక కాదు..విద్యార్థులకు దగా కానుక….

#press club

కడపజిల్లా చిట్వేల్ పట్టణంలోని ప్రెస్ క్లబ్ లో సోమవారం వైసిపి ప్రభుత్వం ఇస్తున్న విద్యా కానుక పై రాష్ట్ర టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి  భత్యాల చెంగల రాయుడు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా బత్యాల  మాట్లాడుతూ సుస్థిర అభివృద్ధి లక్ష్యాల సూచికపై ఇటీవల నీతి ఆయోగ్ (2020-21) నివేదిక లో జాతీయ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ 19వ స్థానంలో నిలిచిందన్నారు.

అక్షరాస్యతలో 27వ స్థానంలో, మౌలిక సదుపాయాల్లో 13 వ స్థానంలో ఉందని – వైసీపీ ప్రభుత్వ పనితీరుకు నీతి ఆయోగ్ నివేదిక అద్దం పడుతుందన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం హయాంలో పాఠ్య పుస్తకాలతో పాటు రెండు జతలకు సరిపడా క్లాత్ పంపిణీ చేశారన్నారు. రూ.40 చొప్పున కుట్టుకూలీ కింద నగదు ఇచ్చారు. ఒక జత బూట్లు, రెండు జతల సాక్సులు, నోట్ బుక్స్ కూడా గతంలో పంపిణీ చేశారన్నారు.

చంద్రబాబు నాయుడు  హయాంలో 8-9 తరగతుల విద్యార్థినులందరికీ సైకిళ్లు అందజేసే కార్యక్రమానికి శ్రీకారం చుడితే జగన్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే.. అందులో అవినీతి జరిగిందంటూ విజిలెన్స్ విచారణకు ఆదేశాలు ఇచ్చిందని, ప్రస్తుతం ఈ సైకిళ్లు తుప్పుబట్టి శిథిలావస్థకు చేరుకొన్నాయని వాపోయారు.

1 నుంచి 10వ తరగతి విద్యార్థులందరికీ విద్యా సంవత్సరం ప్రారంభం కాగానే పాఠశాల విద్యార్థులకు పుస్తకాలు, ఇతర వస్తువులు పంపిణీ చేయడం కొత్త కాదని ఏ ప్రభుత్వం ఉన్నా విద్యార్థులకు అందజేసే వారని అన్నారు.

అంగన్ వాడి కేంద్రాల్లో ఆరు రకాల సేవలు అందిస్తు ఆంగ్లంలో భోదించటానికి కూడా సిద్ధమవుతున్నా ప్రభుత్వం ఏకపక్షంగా ప్రజలకు అందుబాటులో ఉన్న అంగన్ వాడి కేంద్రాలను తీసుకెళ్లి ప్రాధమిక పాఠశాలల్లో కలపటం దుర్మార్గం అన్నారు. అంగన్ వాడి కేంద్రాలు గ్రామాల్లో గర్బినిలకు ,బాలింతలకు , చిన్న పిల్లలకు దగ్గరగా ఉండటంతో సులువుగా వచ్చి వెళుతున్నారని, సేవలు ఉపయోగించుకుంటున్నారని, నేడు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంతో అంగన్ వాడి కేంద్రాలను పాఠశాలలో కలపటం వల్ల వారంతా వచ్చే అవకాశం ఉండదన్నారు. ప్రభుత్వం వెంటనే ఈ అనాలోచిత నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు.

నాడు-నేడు పేరుతో అవినీతికి తెరలేపారని టీడీపీ హాయంలో పాఠశాల బిల్డింగు, మరుగుదొడ్లు, కాంపౌండ్ వాల్ కట్టించి రంగులు వేసి అందించారని,ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం దానికి కేవలం రంగులు మాత్రమే వేసి లక్షల్లో బిల్లులు తీసుకుంటున్నారని ఆరోపించారు.

ఉదాహరణ గా తూర్పు గోదావరి జిల్లాలో రూ.25 లక్షలతో ఒక పాఠశాలను టీడీపీ అధునాకరిస్తే కేవలం రంగులు మార్చి వైసీపీ నేతలు రూ.35 లక్షల బిల్లులు చేసుకున్నారని బత్యాల గారు ఆరోపించారు.

రాష్ట్ర వ్యాప్తంగా ఇదే పరిస్థితి నెలకొందని వ్యాఖ్యానిస్తూ ఇప్పటికైనా గత తెలుగుదేశం ప్రభుత్వంలో విద్యార్థులకు అందజేసిన విధంగా వైసిపి ప్రభుత్వం కూడా చర్యలు తీసుకుని అందరి విద్యార్థులకు అన్ని అందేలా చూడాలని బత్యాల తెలుగుదేశం పార్టీ తరుపున రాజంపేట నియోజకవర్గం ప్రజల తరుపున డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పార్లమెంట్ మహిళ కార్యదర్శి ఆదిలక్షమ్మ, కస్తూరి సుధాకర్,మణి,రమణ తదితరులు పాల్గొన్నారు

Related posts

‘నవీన విద్యావిధానం’ విశ్వమంతటికీ దారిచూపాలి

Satyam NEWS

ఎనిమిదవ నిజాం మృతి పట్ల హోమ్ మంత్రి సంతాపం

Bhavani

రఘురామ ఆట మొదలైంది: ఇక నెక్స్ట్ ఎవరో….???

Satyam NEWS

Leave a Comment