30.7 C
Hyderabad
April 29, 2024 06: 43 AM
Slider కరీంనగర్

విద్యార్థిని మనీషా ఎలా చనిపోయింది..?

#Maneesha

మంచిర్యాల జిల్లాలోని బెల్లంపల్లి సమీకృత వసతి గృహంలో 9వ తరగతి విద్యార్థిని మనీషా ఆకాలంగా మృతి చెందింది. ఈ ఘటన ఫిబ్రవరి 12వ తేదీన చోటు చేసుకుంది.

అపస్మారక స్థితిలో కింద పడిపోయి ఉన్న మనీషా ను మంచిర్యాలలోని ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకొచ్చే లోగానే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కొన్ని గంటల్లోనే మృతి చెందడంతో విద్యార్థి సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి.

ఈ ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని డిమాండ్ చేశాయి. పాఠశాలల పునఃప్రారంభం అనంతరం ఐదు రోజుల్లోనే ఆమె చనిపోవడం జిల్లా వ్యాప్తంగా సంచలనం రేపింది. ఎట్టకేలకు ఆలస్యంగానైనా హాస్టల్ వార్డెన్ ను కలెక్టర్ సస్పెండ్ చేశారు.

పూర్తి స్థాయిలో వివరాలు సేకరించాలని భావించి పునర్ విచారణకు ఆదేశించారు. జిల్లా బీసి సంక్షేమ అధికారి ఖాజా అహ్మద్ మహమ్మద్ నదీమ్ ను విచారణ ఆధికారిగా నియమించారు. 20 రోజుల క్రితమే ఆదేశాలు వచ్చినప్పటికీ మరోసారి కూఫి లాగడానికి అధికారులు ఈ హాస్టల్ లో అడుగిడుతున్నారు.

అసలు విద్యార్హిని మనీషా ఎలా చనిపోయింది.. ? ఆమె అనారోగ్యంతో బాధ పడుతున్నదని హాస్టల్ సిబ్బంది చెప్పినా… ఆసుపత్రికి ఎందుకని తీసుకెళ్ల లేదు…? అర్ఎంపీ వైద్యుడు చికిత్స చేయడానికి ఎందుకని నిరాకరించాదు..?

అనారోగ్యమే కారణమైతే.. ఆమె ఒంటిపై గాయాలు ఎలా అయ్యాయి…? రక్తస్రావం ఎందుకయ్యిది…? ఆమెతో పాటు హాస్టల్ గదిలో మరో ముగ్గురు విద్యార్థులు అక్కడి నుండి వారి స్వగ్రామానికి ఎందుకు పోయారు..? ఈ చిక్కుముడులన్ని ఈ విచారణ లో తెలుతాయా..  అనే దానిపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది…

Related posts

పోలీస్, ప్రెస్ దొంగ స్టిక్కర్లతో తిరుగుతున్న వారిపై కఠిన చర్యలు

Satyam NEWS

కేసీఆర్ ఓటమితో బీఆర్ఎస్ భూస్థాపితం

Bhavani

యూపీలో సరయూ నహర్ జాతీయ ప్రాజెక్టు ప్రారంభోత్సవం

Sub Editor

Leave a Comment