38.7 C
Hyderabad
May 7, 2024 17: 20 PM
Slider నల్గొండ

సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక దృష్టి పెట్టండి

#elections

త్వరలో జరగనున్న సార్వత్రిక ఎన్నికలు-2023 సందర్భంగా నియోజక పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాలలో మౌలిక వసతులు కల్పించాలని జిల్లా ఎన్నికల అధికారి,కలెక్టర్ యస్.వెంకట్రావ్ అధికారులను ఆదేశించారు. సూర్యాపేట జిల్లా హుజూర్ నగర్ ఆర్డీవో కార్యాలయంలో  హుజూర్ నగర్ నియోజకవర్గ స్థాయి రెవెన్యూ,పోలీస్ అధికారులతో ఏర్పాటు చేసిన సమన్వయ సమావేశంలో జిల్లా యస్.పి.రాజేంద్ర ప్రసాద్ తో కలసి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా కలెక్టర్ ఎస్. వెంకట్రావు మాట్లాడుతూ పటిష్ఠమైన ముందస్తు ప్రణాళికతో ముందుకు వెళ్ళాలని, సమస్యత్మకమైన, దుర్బలమైన పోలింగ్ కేంద్రాలను గుర్తించి ఎక్కడ కూడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా చూడాలని సూచించారు. ఎన్నికల నిర్వహణలో రూట్ మ్యాప్ పక్కాగా ఉండాలని,పటిష్టమైన పోలీస్ రక్షణతో పాటు బందోబస్తు నిర్వహించాలని ఆదేశించారు. ఎన్నికల నిర్వహణకు సంబంధించి రూట్ మ్యాప్,పోలీస్ బందోబస్తు,సమస్యాత్మక కేంద్రాల నిర్వహణ,అక్రమ రవాణా నిరోధం,వెబ్ కాస్టింగ్,సీసీ కెమెరాలు,ఎన్నికల నియమావళి అమలు అంశాలపై చర్చించి పలు సలహాలు,సూచనలు చేశారు. ఎప్పటికప్పుడు అప్రమత్తంగా ఉండి పని చేయాలని అన్నారు.

అనంతరం జిల్లా యస్.పి.రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ జిల్లాలో నియోజక వర్గాల వారీగా సమస్యాత్మకంగా ఉన్న పోలింగ్ కేంద్రాలపై ప్రత్యేక నిఘా ఉంచామని,ఎన్నికల నిర్వహణలో భాగంగా పటిష్ట బందోబస్తు చేపట్టనున్నట్లు తెలిపారు.అనంతరం మట్టపల్లి అంతరాష్ట్ర చెక్ పోస్ట్ ను ఎస్పీ తో కలసి పరిశీలించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ నాగేశ్వరరావు,ఆర్డీవో జగదీశ్వర్ రెడ్డి,ఎస్ డి పి ఓ,మండల స్థాయి అధికారులు,ఎన్నిక సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

సత్యం న్యూస్ ప్రతినిధి, హుజూర్ నగర్

Related posts

రక్తదాన శిబిరాలను కూడా మూర్ఖులు విమర్శిస్తున్నారు

Satyam NEWS

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ ఏప్రిల్ 17 కు వాయిదా

Satyam NEWS

పునాది నుంచే విద్యా వ్యవస్థ పటిష్టతకు చర్యలు

Bhavani

Leave a Comment