27.7 C
Hyderabad
May 4, 2024 07: 56 AM
Slider నిజామాబాద్

16 వ రోజు సమగ్ర శిక్ష ఉద్యోగుల నిరాహార దీక్షలు

#samagra

సమగ్ర శిక్ష ఉద్యోగులు చేపట్టిన నిరాహార దీక్షలు 16 వ రోజుకు చేరాయి. నేడు మున్సిపల్ కార్యాలయం వద్ద మహిళా ఉద్యోగులు బతుకమ్మ ఆడి నిరసన తెలిపారు. అనంతరం నిజాంసాగర్ చౌరస్తా వద్దకు వెళ్లి మానవహారం నిర్వహించి నిరసన తెలిపారు. ఈ సందర్బంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. రెగ్యులర్ చేయడమే తమ ప్రధాన డిమాండ్ అన్నారు. ప్రభుత్వం స్పందించి తమను రెగ్యులర్ చేయాలని కోరారు. లేకపోతే దీక్షలు ఆపే ప్రసక్తే లేదన్నారు. నిరంతరం విద్యార్థుల సంక్షేమం కోసం పని చేసే తమను ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదన్నారు. తాము అలవికాని కోరికలు కోరడం లేదని, ఇతర శాఖల ఉద్యోగులను రెగ్యులరైజ్ చేసినట్టుగానే తమను కూడా రెగ్యులర్ చేయాలని కోరుతున్నామని తెలిపారు.

Related posts

విక్రమ సింహపురి యూనివర్సిటీ కి గ్రీన్ ఛాంపియన్ అవార్డు

Satyam NEWS

ఉప్పల్ లో బస్తీ దవాఖానలను ప్రారంభించిన వైద్య మంత్రి

Satyam NEWS

కడప జిల్లాలో ఉక్కు పరిశ్రమకు నిధులు కేటాయించి పనులు ప్రారంభించాలి

Satyam NEWS

Leave a Comment