26.7 C
Hyderabad
May 3, 2024 07: 25 AM
Slider నిజామాబాద్

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై హైకోర్టు విచారణ ఏప్రిల్ 17 కు వాయిదా

#kamareddymasterplan

కామారెడ్డి మాస్టర్ ప్లాన్ పై నేడు హైకోర్టులో విచారణ జరిగింది. ప్రభుత్వ వాదనలు విన్న కోర్టు ఏప్రిల్ 17 కు విచారణను వాయిదా వేసింది. కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అమలు చేస్తే రైతులు తమ భూములు కోల్పోతారని, మాస్టర్ ప్లాన్ రద్దు చేయాలని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కెఏ పాల్ హైకోర్టులో వేసిన పిటిషన్ పై నేడు విచారణ జరిగింది. కామారెడ్డి మున్సిపల్ కౌన్సిల్ మాస్టర్ ప్లాన్ రద్దు చేస్తూ చేసిన తీర్మానంపై ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తెలపాల్సిందిగా గత విచారణ సమయంలో కోర్టు సూచించింది. అయితే కామారెడ్డి మాస్టర్ ప్లాన్ అంశాన్ని ప్రభుత్వం హోల్డ్ లో ఉంచిందని కోర్టుకు తెలిపింది ప్రభుత్వం. దాంతో కోర్టుకు తెలపకుండా మాస్టర్ ప్లాన్ ఫై ఎలాంటి నిర్ణయం తీసుకోవద్దని ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. మాస్టర్ ప్లాన్ పై సింగిల్ బెంచ్ లో ఉన్న మరో పిటిషన్ ను డివిజన్ బెంచ్ లో ఇంప్లీడ్ చేసింది. డివిజన్ బెంచ్ లో పార్టీ ఇన్ పర్సన్ గా కెఏ పాల్ తన వాదనలు వినిపించారు. తదుపరి విచారణ ఏప్రిల్ 17కు వాయిదా వేసింది హైకోర్టు.

కెఏ పాల్ తో కామారెడ్డి మాస్టర్ ప్లాన్ బాధిత రైతులు

Related posts

విదేశాల నుంచి వచ్చినవారు స్వచ్చందంగా చెప్పాలి

Satyam NEWS

బాబా జీవితమే సమస్త మానవాళికి సందేశం

Bhavani

పి.ఎఫ్ డబ్బులను దోచుకున్న కాంట్రాక్టర్ల పై చర్యలు తీసుకోవాలి

Bhavani

Leave a Comment