28.7 C
Hyderabad
May 5, 2024 10: 25 AM
Slider విజయనగరం

సీఎం జగన్ విజయనగరం పర్యటనకు విస్తృత బందోబస్తు

#police

విజయనగరం జిల్లా భోగాపురంలో ఏ.రావివలసలో వచ్చే నెల మే 3న నూతనంగా నిర్మించనున్న విమానశ్రయ నిర్మాణ పనులకు శంఖు స్థాపన చేసేందుకు సీఎం జగన్ పర్యటించనున్న నేపథ్యంలో విస్తృత బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లుగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక తెలిపారు.

ఈ మేరకు  జిల్లా ఎస్పీ ఎం. దీపిక జిల్లా పోలీసు కార్యాలయం లో  సిబ్బంది తో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. సీఎం జగన్ పర్యటనకు చేపట్టనున్న బందోబస్తు, భద్రతా ఏర్పాట్లను సమీక్షించి, అధికారులకు దిశా నిర్దేశం చేసారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ ఎం.దీపిక మాట్లాడుతూ సీఎం పర్యటనలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు, ఇబ్బందులు తలెత్తకుండా అన్ని భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. జాతీయ రహదారికి దగ్గరలో హెలిప్యాడ్ మరియు మీటింగు స్థలం ఉన్నందున జాతీయ రహదారిపై వాహనాల రాక, పోకలకు ఎటువంటి విఘాతం కలుగకుండా చర్యలు చేపడుతున్నామన్నారు.

ఇందుకు ప్రత్యేకంగా ట్రాఫిక్ రెగ్యులేషన్, పార్కింగు స్థలాల వద్ద ప్రత్యేకంగా పోలీసు సిబ్బందిని, అధికారులను నియమించడంతో పాటు, పర్యవేక్షించేందుకు ఉన్నత స్థాయి పోలీసు అధికారిని నియమించామన్నారు. సీఎం పర్యటనలో పాల్గొనేందుకు వచ్చే ముఖ్య వ్యక్తుల వాహనాలకు, ప్రజలకు వేరు వేరుగా పార్కింగు స్థలాలను కేటాయించామన్నారు. ముఖ్యమైన వ్యక్తుల వాహనాలకు కేటాయించిన పార్కింగు స్థలాల్లో వారి వాహనాలను మాత్రమే అనుమతించాలని అధికారులను ఆదేశించారు.

సభా స్థలం వద్ద బ్యారికేడింగు పటిష్టంగా ఏర్పాటు చేసే విధంగా సంబంధిత ఇతర శాఖల అధికారులతో సమన్వయం చేసుకోవాలన్నారు. సీఎం పర్యటనలో పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది నిర్వహించాల్సిన విధులను చేపట్టాల్సిన భద్రతా చర్యలను సంబంధిత అధికారులకు జిల్లా ఎస్పీ వివరించారు. అనంతరం, క్షేత్ర స్థాయిలో విధులు నిర్వహించాల్సిన ప్రాంతాలను, సభా స్థలం, హెలిప్యాడ్, పార్కింగు స్థలాలను సంబంధిత అధికారులు ప్రత్యక్షంగా సందర్శించాలని, నిర్వహించాల్సిన భద్రతా విధులపై సంపూర్ణ అవగాహన కలిగి ఉండాలని అధికారులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక ఆదేశించారు.

ఈ సమీక్షా సమావేశంలో ఎస్సీ, ఎస్టీ సెల్ డిఎస్పీ ఆర్.శ్రీనివాసరావు, బొబ్బిలి డిఎస్పీ బి. మోహనరావు, ట్రాఫిక్ డిఎస్పీ ఎల్.మోహనరావు, డిటిసి డిఎస్పీ వీరకుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్.శేషాద్రి, సిఐలు విజయనాధ్, జి.రాంబాబు, ఈ. నర్సింహమూర్తి, జె. మురళి, బి. వెంకటరావు, సిహెచ్. లక్ష్మణరావు, టివి తిరుపతిరావు, రాజశేఖర్, జి.సంజీవరావు, ఎం. నాగేశ్వరరావు, ఎస్. తిరుమలరావు, సింహాద్రి నాయుడు, ఎల్. అప్పల నాయుడు, కే.రవికుమార్, హెచ్.ఉపేంద్ర, ఎం. బుచ్చిరాజు, బి. నాగేశ్వరరావు, ఎస్.బాల సూర్యారావు, ఆర్ఎస్ఐ రమణమూర్తి, పలువురు ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, మరియు ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

సిటిజన్ చార్టర్: అవినీతికి పాల్పడితే ఇక ఇంటికే

Satyam NEWS

నూతన చట్టంతో తాకట్టులోకి దేశ వ్యవసాయ రంగం

Satyam NEWS

కుటుంబంతో పాటు స‌మాజాన్ని కూడా న‌డిపేది..ఒక్క స్త్రీ మాత్ర‌మే

Satyam NEWS

Leave a Comment